ETV Bharat / entertainment

ఇప్పుడే పెళ్లి చేసుకోను.. నా దృష్టిలో లవ్​ అంటే అదే : అఖిల్​

తన పెళ్లి గురించి వస్తున్న వార్తల​పై ఎట్టకేలకు స్పందించాడు యంగ్​ హీరో అఖిల్​ అక్కినేని. ఓ టీవీ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అఖిల్​.. తన పెళ్లిపై వస్తున్న రూమర్స్​కు ఫుల్​ స్టాప్​ పెట్టే ప్రయత్నం చేశారు. ఇంకా ఎమన్నారంటే..

akhil akkineni latest comments on his marriage
పెళ్లి లవ్​పై హీరో అఖిల్ అక్కినేని కామెంట్స్
author img

By

Published : Mar 19, 2023, 10:38 PM IST

Updated : Mar 19, 2023, 10:57 PM IST

టాలీవుడ్​ యంగ్​ హీరో అఖిల్​ అక్కినేని తన బ్యాచిలర్​ జీవితంపై వస్తున్న వదంతుల​పై నోరు విప్పారు. ఈ వార్తలకు చెక్​ పెట్టె ప్రయత్నం చేశారు. తాజాగా ఓ టీవీ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చారు అఖిల్​. తన వివాహానికి సంబంధించి వస్తున్న వార్తలన్ని రూమర్స్​ అని కొట్టిపారేశారు అఖిల్. అలాగే తాను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం లేదని.. ఇంకా దానికి చాలా సమయం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి సింగిల్​ లైఫ్​నే ఆస్వాదిస్తున్నానని చెప్పారీ 28 ఏళ్ల హీరో.

"మీ ఉద్దేశంలో లవ్​ అంటే ఏంటి..?" అని యాంకర్​ అడిగిన ప్రశ్నకు.. తన దృష్టిలో లవ్​ అంటే స్పోర్ట్స్​ (క్రీడలు) అంటూ బదులిచ్చారు. తనకు చిన్నప్పటి నుంచే ఆటలంటే చాలా ఇష్టమని చెప్పారు. చైల్డ్​హుడ్​ డేస్​లో తాను ఎప్పుడు క్రికెట్​ ఆడినా టీమ్​కు కెప్టెన్​గానే ఉండేవాడని అన్నారు. ఆటలో తాను సిక్సర్​లు కొట్టినప్పుడల్లా ఎన్నో కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయని గుర్తుచేసుకున్నారు అఖిల్​. ఇకపోతే స్పోర్ట్స్ ఆడడం వల్ల మనిషి మానసికంగా, శారీరకంగానూ దృఢంగా ఉంటాడని.. అందుకని ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఆటలు ఆడాలని సూచించారు. అలాగే తాను సోషల్​ మీడియాలో ఎందుకు యాక్టివ్​గా ఉండరు అని అడిగిన ప్రశ్నకు.. "దాని గురించి నాకు అంతగా అవగాహన లేదు. అదంటే కొంచెం భయం. అందుకే కేవలం నా సినిమాలకి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే అందులో పంచుకుంటాను" అని అఖిల్​ సమాధానమిచ్చారు.

ఇక అఖిల్​ సినిమాల విషయానికొస్తే.. 2021లో "మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌" సినిమాతో ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు అఖిల్. కొత్తగా "ఏజెంట్​" అనే మూవీలో నటించారు. స్పై థ్రిల్లర్‌ కథాంశంతో రానున్న ఈ చిత్రాన్ని రేసుగుర్రం దర్శకుడు సురేందర్‌ రెడ్డి డైరెక్ట్​ చేశారు. సురేందర్​ రెడ్డి, అనిల్​ సుంకర సంయుక్తంగా నిర్మించారు. నిర్మాతగా సురేందర్​ రెడ్డి మొదటి చిత్రం ఇదే. నటిగా సాక్షి వైద్య నటిస్తున్నారు. కేరళ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం రూ.80 నుంచి రూ.90 కోట్ల వరకు ఖర్చు చేశారట నిర్మాతలు. ఇక ప్రస్తుతం జరుగుతోన్న "సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌" (సీసీఎల్​)లో టాలీవుడ్‌ టీమ్‌ "తెలుగు వారియర్స్‌"కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు అఖిల్‌.

Last Updated : Mar 19, 2023, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.