ETV Bharat / entertainment

'ఏజెంట్'​ కోసం వెతుకుతున్న 'ధృవ'.. ఇది కూడా అందులోని భాగమేనా? - ఏజెంట్​ మూవీ ధృవ మూవీ

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఏజెంట్. భారీ బడ్జెట్​తో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్​ 28న థియేటర్లలో రిలీజ్​కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో మూవీ టీమ్ ఓ కొత్త వీడియోను రిలీజ్​ చేసింది. దీంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

dhruva x agent
ram charan and akhil
author img

By

Published : Apr 27, 2023, 9:58 AM IST

టాలీవుడ్ స్టార్​ డైరెక్టర్​ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న చిత్రం 'ఏజెంట్'. స్పై యాక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్​కు జంటగా సాక్షి వైద్య నటిస్తుండగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళన్​ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 28న తెలుగు, మలయాళ భాషల్లో ఈ సినిమా గ్రాండ్​గా రిలీజయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్లను వేగవంతం చేసి మూవీ యూనిట్​ లేటెస్ట్​గా ఓ వీడియోను నెట్టింట పోస్ట్ చేసింది. ఆ వీడియోను మూవీ హీరో అఖిల్​ తన ట్విట్టర్​ అకౌంట్​లో షేర్​ చేశారు.

'థింగ్స్​ ఆర్​ గెట్టింగ్​ వైల్డ్'​ అనే క్యాప్షన్​తో మొదలయ్యే ఆ వీడియోలో మెగాపవర్​స్టార్​ రామ్ చరణ్ నిలబడుకుని ఉండగా.. 'ధృవ' సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లే అవుతుంటుంది. ఇక వీడియో ఆఖరిలో "ఏజెంట్ ఎక్కడ ఉన్నావు" అని చరణ్​ అంటారు. ఇక ఈ వీడియోకు 'స్టే ట్యూన్డ్​ ధృవ x ఏజెంట్'​ అన్న క్యాప్షన్​ను జోడించారు. దీంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. అసలు ఈ వీడియోకు అర్థం ఏంటా అంటూ పలువురు అభిమానులు నెట్టింట తెగ వెతికేస్తున్నారు.

ఇదంతా చూస్తుంటే ఇది కూడా సినిమాలోని ఓ భాగంలా ఉందని కొందరు అంటుంటే.. మరికొందరేమో ఇది సురేందర్​ రెడ్డి యూనివర్స్​లో భాగమని అంటున్నారు. ఇంకొతమందేమో ప్రమోషన్లలో భాగంగా మూవీ టీమ్ ఈ ఇద్దరితో ఓ స్పెషల్ ఇంటర్వ్యూకు ప్లాన్​ చేసిందేమో అని అంటున్నారు.​ ఒక వేళ ఈ సినిమాలో చెర్రీ గెస్ట్ రోల్​ కూడా చేయనున్నాడా అన్న వార్తలు కూడా సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

గతంలో సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ కాంబినేషన్​లో తెరకెక్కిన 'ధృవ' సినిమా బాక్సాఫీస్​ వద్ద అద్భుత విజయాన్ని సాధించింది. అప్పట్లో ఈ సినిమాకు కనెక్ట్​ అయిన అభిమానులు దీని సీక్వెల్​ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూశారు. ఈ క్రమంలో 'ధృవ 2' సినిమా తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు కూడా ప్లాన్​ చేస్తున్నారన్న టాక్​ కూడా నడిచింది.

అయితే ఇప్పుడు ఈ వీడియో చూసిన అభిమానులు ఈ రెండు సినిమాలను లింక్​ ఏమైనా ఉందా అని ఆలోచిస్తున్నారు. అంతే కాకుండా రెండు సినిమాలు కూడా స్పై థ్రిల్లర్స్​ కావడం వల్ల కచ్చితంగా ఇవి యూనివర్స్​లో భాగమయ్యుందచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంపై మూవీ యూనిట్​ క్లారిటీ ఇచ్చేంత వరకు అసలు విషయం తెలియదని అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.