Nagarjun The Ghost movie shooting: టాలీవుడ్ కింగ్ నాగార్జున- దర్శకుడు ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ది 'ఘోస్ట్'. సోనాల్ చౌహాన్ కథానాయిక. ఇటీవలే దుబాయ్‌లో యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న చిత్రబృందం.. తాజాగా కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించుకుంది. ఊటీలో దీన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా ఓ అద్భుతమైన ఫొటోను పోస్ట్ చేసి తెలిపారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. 'ఉదయం ఎప్పుడూ మ్యాజికల్గానే ఉంటుంది' అని వ్యాఖ్య రాసుకొచ్చారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాగ్ మాజీ రా అధికారిగా కనిపించనున్నారు. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.
Nagashourya krishna vindra vihari song: యువహీరో నాగశౌర్య నటించిన రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. అనీష్ ఆర్.కృష్ణ దర్శకుడు. షిర్లే సెటియా కథా నాయిక. తాజాగా ఈ మూవీలోని 'వర్షంలో వెన్నెల' అనే రొమాంటిక్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది చిత్రబృందం. యువతను ఆకట్టుకునేలా ఉన్న ఈ గీతాన్ని.. ఆదిత్య ఆర్కే, సంజన కల్మంజి ఆలపించారు. సంప్రదాయబద్ధమైన కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు.. ఉద్యోగం కోసమంటూ హైదరాబాద్ వెళ్తాడు. ఆ తర్వాత ప్రేమలో పడిన అతని ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగిందనేది ఈ చిత్ర కథాంశం. ఇందులో నాగశౌర్య బ్రాహ్మణ యువకుడిగా ఓ కొత్త రకమైన పాత్రలో కనిపించనున్నారు. సీనియర్ నటి రాధిక బలమైన పాత్రలో కనిపిస్తారు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాయిశ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శంకర్‌ప్రసాద్ మూల్పూరి సమర్పకులు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Akkineni Akhil Birthday Agent movie: సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్న కొత్త చిత్రం 'ఏజెంట్'. నేడు(శుక్రవారం) ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో అఖిల్ లుక్ అదిరిపోయింది. సిగరెట్ కాలుస్తూ వైల్డ్‌గా కనిపించారాయన. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా, స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. వక్కంతం వంశీ కథ అందించగా తమన్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ రెడ్డికి చెందిన సరెండర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర మూవీని నిర్మిస్తున్నారు. ఆగస్టు 12న విడుదల కానుందీ చిత్రం
Aadi Saikumar new movie title announced: టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ భిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన ఫణికృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. దిగంగనా సూర్యవంశీ కథనాయిక. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. సినిమాకు 'క్రేజీ ఫెలో' అనే టైటిల్‌ను ఖరారు చేస్తున్నట్లు ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది. ఇక ఈ చిత్రానికి ఆర్.ఆర్.ధ్రువన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా.. సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం అందిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పకులు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది.
-
We are very much Happy to share our movie name with you all.
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) April 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
⭐ing @AadiSaikumar @DiganganaS @mirnaaofficial
🎞️@SriSathyaSaiArt
🎬@siriki_phani
🎹#RRDhruvan
🎥#SatishMutyala
✂️@GiduturiSatya
💰@KKRadhamohan
🎧@adityamusic
📰@UrsVamsiShekar pic.twitter.com/HLsXGdMuQm
">We are very much Happy to share our movie name with you all.
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) April 8, 2022
⭐ing @AadiSaikumar @DiganganaS @mirnaaofficial
🎞️@SriSathyaSaiArt
🎬@siriki_phani
🎹#RRDhruvan
🎥#SatishMutyala
✂️@GiduturiSatya
💰@KKRadhamohan
🎧@adityamusic
📰@UrsVamsiShekar pic.twitter.com/HLsXGdMuQmWe are very much Happy to share our movie name with you all.
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) April 8, 2022
⭐ing @AadiSaikumar @DiganganaS @mirnaaofficial
🎞️@SriSathyaSaiArt
🎬@siriki_phani
🎹#RRDhruvan
🎥#SatishMutyala
✂️@GiduturiSatya
💰@KKRadhamohan
🎧@adityamusic
📰@UrsVamsiShekar pic.twitter.com/HLsXGdMuQm
ఇదీ చూడండి: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. కానీ అక్కినేని అభిమానులకు మాత్రం..