ETV Bharat / entertainment

చిరు, బాలయ్య రికార్డులు బ్రేక్​ చేసిన 'ఏజెంట్​'.. ఆ విషయంలో అయ్యగారే నెం.1! - ఏజెంట్​ మూవీ దర్శకుడు

అక్కినేని అఖిల్​ నటించిన 'ఏజెంట్'​ మూవీ సరికొత్త రికార్డు క్రియేట్​ చేసింది. సంక్రాంతి బరిలోకి దిగి సూపర్​ హిట్​ అయిన వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి చిత్రాల రికార్డులను బ్రేక్​ చేసింది. ఆ రికార్డు ఏంటంటే?

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 20, 2023, 4:51 PM IST

అక్కినేని వారసుడు అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఏజెంట్'. భారీ బడ్జెట్​తో స్పై థ్రిల్లర్​గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అఖిల్​ కొండంత ఆశలు పెట్టుకున్నారు. మూవీ రిలీజ్​ డేట్​ దగ్గర పడటంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. చిత్రయూనిట్​ కాస్త వెరైటీగా ప్రమోషన్లను నిర్వహిస్తోంది. అఖిల్.. ఈ మూవీలో డిఫరెంట్ లుక్‌, సరికొత్త హెయిర్ స్టైల్, సిక్స్ ప్యాక్ బాడీతో వైల్డ్ లుక్‌లో కనిపించనున్నారు. ఓ సీక్రెట్​ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనువిందు చేయనున్నారు. 'ది మోస్ట్ నోటోరియస్, మోస్ట్ రూత్ లెస్ పేట్రియాట్' అనే డైలాగ్‌తో రిలీజ్​ అయిన టీజర్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అఖిల్ క్యారెక్టర్ ఎంత వైల్డ్‌గా ఉండబోతుందనేది చెప్పేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్ మొత్తం మరింత ఉత్కంఠభరితంగా, గ్రిప్పింగ్‌గా ఉంది. అఖిల్ క్యారెక్టర్‌ కూడా ఆసక్తిగా ఉంది.

అయితే ఇప్పుడు 'ఏజెంట్' మూవీ ట్రైలర్ యూట్యూబ్​లో సరికొత్త రికార్డు సృష్టించింది. వ్యూస్ విషయంలో.. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ అయిన చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలను వెనక్కి నెట్టింది. ఏజెంట్ ట్రైలర్‌కు 24 గంటల్లో 12 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. వాల్తేరు వీరయ్య సినిమాకు 11.5 మిలియన్లు వ్యూస్ రాగా, వీరసింహారెడ్డి సినిమాకు 10 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ రెండు మూవీల రికార్డును ఏజెంట్​ సినిమా బ్రేక్​ చేసింది.

సుమారు రెండేళ్లుగా చిత్రీకరిస్తున్న ఈ మూవీ గతేడాది ఆగస్టు 12నే విడుదల కావల్సి ఉంది. కానీ అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోయారు. దీంతో ఇప్పుడు ఏప్రిల్ 28న గ్రాండ్​గా థియేటర్లలో మూవీని విడుదల చేస్తున్నారు. అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తున్నారు. మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. సురేందర్​ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్ రెడ్డికి చెందిన స‌రెండ‌ర్ 2 సినిమా ప‌తాకాల‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సహ నిర్మాతలుగా అజ‌య్ సుంక‌ర‌, ప‌త్తి దీపారెడ్డి ఉన్నారు.

ఇకపోతే 'ఏజెంట్' విడుదల తర్వాత అఖిల్ అక్కినేని సూపర్ స్టార్ అవుతాడని ఈ సినిమా దర్శక - నిర్మాతలు సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర చాలా కాన్ఫిడెంట్​గా ఉన్నారు! ఇటీవలే జరిగిన ప్రెస్​మీట్​లో 'సూపర్ స్టార్ ఇన్ మేకింగ్' అంటూ అనిల్ సుంకర స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. తమ ఫ్యామిలీ హీరోలకు రొమాంటిక్ ఇమేజ్ ఉన్నా.. తనకు మాత్రం యాక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టమని అఖిల్ స్పష్టం చేశారు. దీని బట్టి చూస్తే భవిష్యత్తులో అఖిల్​.. యాక్షన్ సినిమాలు ఎక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.