ETV Bharat / entertainment

సల్మాన్ ఖాన్​ సెక్సియెస్ట్​ పర్సన్: ​ఐశ్వర్యా రాయ్​ కామెంట్స్​ విన్నారా? - సల్మాన్ ఖాన్​ సెక్సియెస్ట్ పర్సన్​ ఐశ్వర్య రాయ్​

బాలీవుడ్​ బ్యూటీఫుల్​ లేడీ ఐశ్వర్యా రాయ్​.. సల్మాన్​ ఖాన్​ను సెక్సియెస్ట్ పర్సన్​గా అభివర్ణించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్​ వైరల్​ అవుతున్నాయి. ఆ సంగతులు..

Aishwarya rai Salman khan
సల్మాన్ ఖాన్​ సెక్సియెస్ట్​ పర్సన్: ​ఐశ్వర్య రాయ్​ కామెంట్స్​ వైరల్​!
author img

By

Published : Apr 12, 2023, 2:29 PM IST

అందాల తార ఐశ్వర్యా రాయ్ బచ్చన్- కండల వీరుడు సల్మాన్ ఖాన్.. బాలీవుడ్​లో ఒక్కప్పుడు క్రేజీ అండ్ పాపులర్​ పెయిర్​. వీరిద్దరూ ప్రేమలో కూడా ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ఆశించినట్లు.. కానీ ఆ తర్వాత విడిపోయినట్లు అంతా మాట్లాడుకుంటుంటారు. అయితే ఐశ్వర్య.. అభిషేక్‌ బచ్చ్​ను పెళ్లి చేసుకుని పర్సనల్​ లైఫ్​లో బిజీ అయిపోగా.. సల్మాన్​ ఖాన్ పెళ్లి చేసుకోకుండా​ ప్రొఫెషనల్​ లైప్​లో బిజీ అయిపోయారు. అప్పుడప్పుడు వీరిద్దరూ ఏమైన ఫంక్షన్​లో ఎదురుపడినా పెద్దగా మాట్లాడుకోకుండానే, చూసి చూడనట్లు వ్యవహరిస్తుంటారు! రీసెంట్​గా ముకేశ్​ అంబానీ సతీమణి నీతా అంబానీ నిర్వహించిన కల్చరల్ సెంటర్ లాంఛ్​ ఈవెంట్‌లోనూ వీరిద్దరూ మెరిశారు. ఒకే ఫ్రేమ్‍‌లో కనిపించారు. అయినా మాట్లాడుకున్నట్లు పెద్దగా కనిపించలేదు.

అయితే తాజాగా ఐశ్వర్య రాయ్​కు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నట్లు ఇంగ్లీష్​ కథనాలు వస్తున్నాయి. ఆ వీడియోలో ఈ సుందరి.. సల్మాన్ గురించి మాట్లాడింది. సల్మాన్ భాయ్​.. బాలీవుడ్‌లో సెక్సియెస్ట్ అండ్ మోస్ట్ గార్జియస్ మ్యాన్‌గా అభివర్ణించింది. బీటౌన్​లో సెక్సీగా, బ్యూటీఫుల్​గా కనిపించే వ్యక్తి ఎవరు? అని ఓ ప్రశ్న ఎదురుకాగా.. ఐశ్వర్య కాసేపు సైలెంట్​గా ఉండి.. తర్వాత సల్మాన్‌ పేరును చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పాత వీడియోను నెట్టింట్లో వైరల్ అవుతుందంటూ తెగ వార్తలు వస్తున్నాయి. కానీ ఆ వీడియోను ఏ సైట్​ వారు దాన్ని ఎంబెడ్​ చేయలేదు. కాగా, సల్మాన్ ఖాన్-ఐశ్వర్యా రాయ్ తొలిసారిగా 'హమ్ దిల్ దే చుకే సనమ్' సినిమాలో కలిసి నటించారు. ఈ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకుడు. ఇందులో అజయ్ దేవగణ్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాతో వీరిద్దరి పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారిందని చెప్పుకుంటుంటారు.

ఇకపోతే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసి కా జాన్' చిత్రంతో ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్​. దీని తర్వాత 'టైగర్ 3', 'టైగర్ వర్సెస్​ పఠాన్' చిత్రాలతో ఆడియెన్స్​ను పలకరించనున్నారు. మరోవైపు ఐశ్వర్య రాయ్ రీసెంట్​గా.. ప్రముఖ డైరెక్టర్​ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన 'పొన్నియిన్ సెల్వన్'తో పలకరించింది. త్వరలోనే 'పొన్నియిన్ సెల్వన్ 2'తో అభిమానులను పలకరించనుంది. ఈ చిత్రం ఏప్రిల్ 28న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ చిత్రాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదీ చూడండి: రెడ్​ హాట్​గా షారుక్​ తనయ.. లవ్లీగా రవీనా టాండన్​ కూతురు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.