Aishwarya Arjun Sarja Engagement : ప్రముఖ నటుడు, దర్శకుడు అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడు, హీరో ఉమాపతితో ఆమె జీవితాన్ని పంచుకోనున్నారు. శుక్రవారం వారి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుక చెన్నైలో జరిగినట్లు తెలుస్తోంది. కొద్దిమంది బంధువులు, పలువురు ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అటు అర్జున్ కుటుంబంగానీ ఇటు తంబి రామయ్య కుటుంబంగానీ ఎటువంటి ఫొటోలు విడుదల చేయలేదు.
-
Here's a new couple in town❤️#Arjun's daughter #Aishwarya & #ThambiRamaiah's son #Umapathy get engaged 💫#AishwaryaArjun #UmapathyRamaiah #Galatta pic.twitter.com/BxJHSvN2il
— Galatta Media (@galattadotcom) October 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Here's a new couple in town❤️#Arjun's daughter #Aishwarya & #ThambiRamaiah's son #Umapathy get engaged 💫#AishwaryaArjun #UmapathyRamaiah #Galatta pic.twitter.com/BxJHSvN2il
— Galatta Media (@galattadotcom) October 27, 2023Here's a new couple in town❤️#Arjun's daughter #Aishwarya & #ThambiRamaiah's son #Umapathy get engaged 💫#AishwaryaArjun #UmapathyRamaiah #Galatta pic.twitter.com/BxJHSvN2il
— Galatta Media (@galattadotcom) October 27, 2023
అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ రియాల్టీ షోలో.. హీరో ఉమాపతి పాల్గొన్నారు. అప్పటి నుంచి ఇరువురి కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఉమాపతి, ఐశ్వర్య ఒకరినొకురు ప్రేమించుకున్నారు. ఉమాపతి పుట్టినరోజు(నవంబరు 8)న పెళ్లి తేదీని ప్రకటిస్తామని తంబి రామయ్య గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
-
Arjun sarja gaaru's daughter Aishwarya got engaged to Thambi Ramaiah gaaru's son Umapathy 😍#arjunsarja #Umapathy #aishwaryaarjun #Aishwarya pic.twitter.com/GfO14ZCEk1
— Navya (@Navya07_) October 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Arjun sarja gaaru's daughter Aishwarya got engaged to Thambi Ramaiah gaaru's son Umapathy 😍#arjunsarja #Umapathy #aishwaryaarjun #Aishwarya pic.twitter.com/GfO14ZCEk1
— Navya (@Navya07_) October 27, 2023Arjun sarja gaaru's daughter Aishwarya got engaged to Thambi Ramaiah gaaru's son Umapathy 😍#arjunsarja #Umapathy #aishwaryaarjun #Aishwarya pic.twitter.com/GfO14ZCEk1
— Navya (@Navya07_) October 27, 2023
కన్నడ, తమిళంలో కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది ఐశ్వర్య. ఓ తెలుగు సినిమా కూడా ఖరారు కాగా.. అది తాత్కాలికంగా నిలిచిపోయింది. అర్జున్ దర్శకత్వంలోనే తెరకెక్కాల్సిన సినిమా అది. మరోవైపు, అర్జున్ కీలక పాత్ర పోషించిన "లియో" థియేటర్లలో సందడి చేస్తోంది. విజయ్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన సినిమా ఇది.
వెంకటేష్ రెండో కుమార్తె నిశ్చితార్థం.. హాజరైన సినీ ప్రముఖులు..
Venkatesh Daughter Engagement : టాలీవుడ్ ఫ్యామిలీ హీరో వెంకటేశ్ ఇంట్లో కూడా త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇప్పుడు ఆయన రెండో కుమార్తె హయవాహిని నిశ్చితార్థం బుధవారం సైలంట్‌గా జరిగింది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడితో వెంకటేశ్ స్వగృహంలోనే ఈ వేడుకను నిర్వహించారు. వచ్చే ఏడాది ఈ జంట పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి, మహేశ్ బాబు, రానా, నాగ చైతన్య ఈ నిశ్చితార్థానికి హాజరై సందడి చేశారు. బోయే వధూవరులను ఆశీర్వదించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Anupama Parameswaran Photo Gallery : చీరకట్టులో మల్లు ముద్దుగుమ్మ.. ఆ చూపుతోనే మాయ చేస్తోందిగా!
Movie Titles With Week Days : సినిమా పేరులో 'వారం'.. టాలీవుడ్లో ఈ టైటిల్సే ట్రెండింగ్!