ETV Bharat / entertainment

మరో మోడల్​ ఆత్మహత్య.. 13 రోజుల్లో నలుగురు..

Saraswathi Das: గత కొద్దిరోజులుగా మోడల్స్​ వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో బెంగాలీ మోడల్, సరస్వతీ దాస్​.. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోల్‌కతాలోని తన ఇంట్లో ఆదివారం విగతజీవిగా కనిపించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Model Suicide
Model Suicide
author img

By

Published : May 30, 2022, 8:09 AM IST

Model Suicide: బంగాల్​లోని కోల్‏కతాలో మోడల్స్ వరుస ఆత్మహత్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే ముగ్గురు మోడల్స్ తమ అపార్ట్‎మెంట్స్​లో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మరువక ముందే ఇప్పుడు మరో మోడల్ కూడా సూసైడ్​ చేసుకున్నారు. కోల్​కతా కస్బా ప్రాంతంలోని తన నివాసంలో ఆదివారం మోడల్​ సరస్వతీ దాస్​ విగతజీవిగా కనిపించారు.

సమాచారం అందుకున్న కస్బా పోలీస్ స్టేషన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నివేదిక వచ్చిన తర్వాత మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. మోడల్​ మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని, ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని చెప్పారు. ఇప్పటివరకు 13 రోజుల్లో నలుగురు మోడల్స్​ ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

మోడలింగ్​ రంగంలో సరస్వతి మంచి స్థాయికి ఎదగాలని కష్టపడిందని స్థానికులు చెబుతున్నారు. అందుకు తగ్గ ఫలితం లభించకపోవడం వల్ల గత కొన్ని రోజులుగా మానసిక కుంగుబాటులోకి వెళ్లిందని తెలిపారు. మానసిక కుంగుబాటుతో ఆత్మహత్య చేసుకుందా? లేక ఈ ఘటన వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చదవండి: 'సిద్ధూ మృతికి వారిదే బాధ్యత.. సిట్ దర్యాప్తు'

వెన్నుకు పసిబిడ్డతో వీధులు ఊడుస్తున్న మహిళ.. వీడియో వైరల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.