ETV Bharat / entertainment

'10 తలలు 2 వరుసల్లోనా.. అప్పట్లో టీషర్ట్​లూ ఉండేవా?'.. రావణుడి VFXపై ఫుల్​ ట్రోల్స్​​!

Adipurush Ravan Look : ఆదిపురుష్ మూవీలో రావణుడి పాత్రకు ఉపయోగించిన గ్రాఫిక్స్, లుక్‍.. సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్‍కు గురవుతోంది. చాలా మంది నెటిజన్లు మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.

Adipurush Ravan Look
Adipurush Ravan Look
author img

By

Published : Jun 16, 2023, 3:32 PM IST

Adipurush Ravan Look : రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‍గా విడుదలైంది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.. శ్రీరాముడిగా, కృతి సనన్.. సీతాదేవిగా నటించారు. ఔం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ మూవీకి మంచి టాక్ వస్తోంది. ఈ చిత్రంలో రావణుడి పాత్రను బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పోషించారు. అయితే ఆదిపురుష్‍లో రావణుడిగా సైఫ్ లుక్, ఆ పాత్రకు ఉపయోగించిన గ్రాఫిక్స్‌, వేషధారణ కొందరినీ నిరాశపరుస్తోంది. రావణుడి గ్రాఫిక్స్ గురించి సోషల్ మీడియాలో చాలా మంది మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. రావణుడి పాత్రపై కామెంట్లు చేస్తున్నారు.

Adipurush Saif Ali Khan Look : ఆదిపురుష్ మూవీలో రావణుడి లుక్‍పై చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. గడ్డం, హెయిర్ స్టైల్ ప్రస్తుత కాలంలా స్టైలిష్‍గా ఉండడాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు. "రావణుడికి ఇప్పటి జనరేషన్ హెయిర్ స్టైలా? రామాయణం కాలంలో సెలూన్‍లు ఉన్నట్టు మేం ఎక్కడా చదవలేదే!" అని ఓ యూజర్ కామెంట్ చేశారు. రావణుడి టిక్‍టాకర్ హెయిర్ కట్ ఎందుకు చేశారని మరో యూజర్ ప్రశ్నించారు. మరికొందరైతే ఇలాంటి లుక్‍లో చూపించి రావణుడి పాత్రను అవమానించారని ఆగ్రహిస్తున్నారు.

ఇక రావణుడి పాత్ర కోసం ఆదిపురుష్‍లో ఉపయోగించిన గ్రాఫిక్స్/వీఎఫ్‍ఎక్స్‌పై మీమ్స్ వెల్లువలా వస్తున్నాయి. ముఖ్యంగా రావణుడి పది తలలు ఒకే వరుసలో కాకుండా.. రెండు వరుసల్లో చూపించిన తీరును చాలా మంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. డబుల్ డెక్కర్ 10 హెడెడ్ లుక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సుమారు రూ.600 కోట్ల బడ్జెట్‍తో తీసిన మూవీలో రావణుడి లుక్ కోసం ఇలాంటి గ్రాఫిక్స్ వినియోగిస్తారా అంటూ చిత్రయూనిట్‍పై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Adipurush Ravan Vfx : పాత కాలం సినిమాల్లోని రావణుడి పాత్రలతో.. ఈ ఆదిపురుష్‍లో సైఫ్ అలీ ఖాన్ రావణుడి లుక్, గ్రాఫిక్స్‌ను పోలుస్తున్నారు. రావణుడి తలలు రాకెట్‍లా టేకాఫ్ అవుతున్నాయంటూ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. మొత్తంగా ఆదిపురుష్‍లో రావణుడి లుక్‍ తీవ్రంగా నిరాశపరిచిందని పేర్కొంటున్నారు. రావణుడికి టీషర్టు లాంటి కాస్ట్యూమ్ వేయడాన్ని కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. ఇప్పట్లో అసలు ఇలాంటి డ్రెస్‍లు ఉండేవా అని ప్రశ్నిస్తున్నారు.

Adipurush First Day Collections : కాగా, ఆదిపురుష్ సినిమాకు తొలి రోజు భారీ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి. మూవీకి మంచి టాక్ వస్తుండడంతో జోరు కొనసాగే అవకాశం ఉంది. తొలి రోజే దేశవ్యాప్తంగా రూ.130 కోట్లకుపైగా కలెక్ట్ చేస్తుందని అంచనాలు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.