ETV Bharat / entertainment

వెనక్కి తగ్గిన 'ఆదిపురుష్​'.. మళ్లీ ఏమైనట్టు? - ఆదిపురుష్ ప్రీమియర్స్​ క్యాన్సిల్​

'ఆదిపురుష్'​ మూవీటీమ్​ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుందట! దీంతో ప్రభాస్​ అభిమానులు మళ్లీ నిరాశ చెందారు. ఆ వివరాలు..

Tribeca Festival Adipurush  show cancel
ఆదిపురుష్ ప్రీమియర్స్​ షో క్యాన్సిల్​
author img

By

Published : May 17, 2023, 12:20 PM IST

Tribeca Festival Adipurush : పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్‌ హీరోగా రూపొందిన ఇతిహాస చిత్రం 'ఆదిపురుష్‌'. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్​గా​ జూన్​ 16న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రం.. సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'ట్రిబెకా ఫెస్టివల్‌'లో ప్రదర్శనకు ఇటీవలే ఎంపికైన సంగతి తెలిసిందే. అమెరికాలోని న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 7 నుంచి 18 వరకు 'ట్రిబెకా ఫెస్టివల్‌' వేడుక జరగనుంది. ఈ వేడుకలో 13,15,17 తేదీలలో ఈ చిత్రం ప్రదర్శితమవుతున్నట్లు మూవీటీమ్ తెలిపింది. ఈ అరుదైన గౌరవం దక్కడంతో ప్రభాస్ అభిమానులు ఎంతగానో సంతోషపడ్డారు. అలానే ఆదిపురుష్ ఎలా ఉందనే టాక్​ ముందుగానే తెలిసిపోతుందని సంబరపడ్డారు.

అయితే ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్​కు ఓ బ్యాడ్ న్యూస్ అందింది! అదేంటంటే.. జూన్​ 13న ప్రదర్శన చేయాల్సిన షోను క్యాన్సిల్ చేశారట. దీంతో కొంతమందికి పలు రకాల అనుమానాలు మెదడులో మెదులుతున్నాయి. ముందుగా అనుకున్నట్లు ఈ ప్రీమియర్​ షో 13వ తేదీన ప్రదర్శిస్తే.. రివ్యూలు ముందుగానే బయటకొచ్చేస్తాయి. సినిమా బాగుంటే ఓకే కానీ. ఒకవేళ ఏమైనా తేడా కొడితే మాత్రం ఓపెనింగ్ కలెక్షన్స్​తో పాటు రిజల్ట్​పై దారుణంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ప్రీమియర్​ను రద్దు చేశారా? లేదా ఇంకేదైనా కారణం ఉందా? అంటూ మాట్లాడుకుంటున్నారు.

ఇప్పటికే సినిమా అనౌన్స్​మెంట్​ తర్వాత రిలీజైన పోస్టర్​, టీజర్​తో చిత్రంపై ఫుల్ నెగటివిటీ వచ్చింది. వీఎఫ్​ఎక్స్​ బాగోలేదంటూ, రావణడు లుక్​ బాలేదంటూ సోషల్​మీడియాలో తీవ్రంగా ట్రోల్స్​ వచ్చాయి. దీంతో సినిమా వాయిదా వేసి మరి వీఎఫ్​ఎక్స్​పై ఫుల్ ఫోకస్​ పెట్టారు. కాస్త సమయం తీసుకొని మళ్లీ వీఎఫ్ఎక్స్​లో మార్పులు చేసి ట్రైలర్​ను రిలీజ్​ చేసింది చిత్ర బృందం. అయితే దీనికి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు షోను క్యాన్సిల్ చేయడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే రామాయణాన్ని ఆధారంగా చేసుకుని భారీ బడ్జెట్‌తో 3డీలో రూపొందింది 'ఆదిపురుష్​'. ఈ చిత్రంలో ప్రభాస్‌.. రాముడిగా నటించగా.. కృతి సనన్‌.. సీత దేవి పాత్రలో కనిపించారు. లంకేశ్‌గా సైఫ్‌ అలీఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీసింగ్‌, హనుమంతుడిగా దేవదత్త నాగే నటించారు. ఈ చిత్రం మొత్తం బడ్జెట్‌ దాదాపు రూ.400 కోట్లకుపైనే ఉంటుందని కొద్ది కాలంగా ప్రచారం సాగుతోంది. అలాగే దాదాపు 15 స్వదేశీ, అంతర్జాతీయ భాషల్లో.. వరల్డ్​వైడ్​గా 20,000 థియేటర్లలో ఒకేసారి రిలీజ్​ కానుందనే వార్తలు కూడా వినిపించాయి.

ఇదీ చూడండి : ఇక్కడ పవన్​ కల్యాణ్​.. అక్కడ వరుణ్​ ధావన్​.. నిజమెంతో?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.