Adipurush OTT Release : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముని పాత్రలో నటించిన సినిమా 'ఆదిపురుష్'. ఈ చిత్రం పలు మార్లు విడుదల వాయిదా పడి.. జూన్ 16న వివిధ భాషల్లో థియోటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. నెగిటివిటీతో పాటు సోషల్ మీడియా ట్రోల్స్ మధ్య విడుదలైన ఈ సినిమా.. మంచి కలెక్షన్లు రాబట్టి ప్రేక్షకులను అలరించింది. అయితే చిత్రం బృందం నుంచి గానీ, ఓటీటీ సంస్థ నుంచి గానీ ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా 'ఆదిపురుష్' సినిమాను ఓటీటీలోకి రిలీజ్ చేశారు. ఈ సినిమా గురువారం నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Adipurush Ott Release Platform : దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించేదుందు వీలుగా.. 'ఆదిపురుష్' మూవీ ఓటీటీ హక్కులను రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ మేరకు ఆ ఓటీటీ సంస్థలు తమ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాయి. వాటి ప్రకటనల ప్రకారం ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక, హిందీ వెర్షన్ 'ఆదిపురుష్'.. మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Adipurush Budget : రామాయణం ఆధారంగా దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించగా.. సీత పాత్రలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నటించింది. ఈ చిత్రాన్ని దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించారు. ఈ సినిమాలో సన్నీ సింగ్ లక్ష్మణుడిగా కనిపించగా.. హనుమంతుడి పాత్రను దేవదత్త నాగే పోషించారు. ఇక లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించారు.
ఆదిపురుష్.. మొదటి నుంచి వార్తల్లోనే..
Adipurush Controversial Scenes : ఈ మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్'.. మొదట్నుంచి ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూనే ఉంది. ప్రారంభంలో ఈ సినిమాను కొన్ని వివాదాలు చట్టుముట్టాయి. రామాయణంలోని పాత్రలను వక్రీకరించారని, గ్రాఫిక్స్ సరిగా లేవని ఆరోపణలు వచ్చాయి. వాటన్నింటినీ ఎదుర్కున్న ఈ మూవీ టీమ్.. అనంతరం గ్రాఫిక్స్‌లో చేసిన పలు మార్పులు చేసింది. ప్రేక్షకులకు మళ్లీ బూస్టప్‌ను తీసుకొచ్చింది. రిలీజైన తర్వాత కూడా ఈ చిత్రం పలు విమర్శలు ఎదుర్కొంది. డైలాగులపై విమర్శలు (adipurush controversial dialogues) వచ్చాయి. దీంతో ఆ డైలాగులను తొలగించి ఎడిట్ వెర్షన్‌ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది.
ఎవరికీ ఆ సామర్థ్యం లేదు.. అది అబద్ధం..! : 'ఆదిపురుష్' ఔం రౌత్
Adipurush Collections : రూ.200 కోట్ల క్లబ్‌లోకి 'ఆదిపురుష్'.. రామాయణం తీయలేదన్న రైటర్!