Adipurush Collections : బాక్సాఫీసు వద్ద 'ఆదిపురుష్' హవా కొనసాగుతోంది. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా.. మూడు రోజుల్లో రూ.340 కోట్లు సాధించింది. రికార్డు ఓపెనింగ్స్‌తో ప్రారంభమైన 'ఆదిపురుష్' బాక్సాఫీస్ జర్నీ.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తూన్నా.. వీకెండ్లో కలెక్షన్ల జోరు కొనసాగించింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 140 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఆదిపురుష్.. మూడో రోజు రూ. 100 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఈ మేరకు ఆదిపురుష్ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ అధికారికంగా ప్రకటించింది. 'ఆదిపురుష్' మూడు రోజులు కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
ఆదిపురుష్ కలెక్షన్లు (వరల్డ్ వైడ్) :
- తొలి రోజు - రూ. 140 కోట్లు
- రెండో రోజు - రూ. 100 కోట్లు
- మూడో రోజు - రూ. 100 కోట్ల
-
Adipurush continues to captivate audiences across generations, crossing an astounding ₹340 crores on the opening weekend at the box office! Jai Shri Ram 🙏#AdipurushBlockbusterWeekend
— T-Series (@TSeries) June 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Book your tickets on: https://t.co/0gHImE23yj#Adipurush now in cinemas near you ✨… pic.twitter.com/vwIubHPGbK
">Adipurush continues to captivate audiences across generations, crossing an astounding ₹340 crores on the opening weekend at the box office! Jai Shri Ram 🙏#AdipurushBlockbusterWeekend
— T-Series (@TSeries) June 19, 2023
Book your tickets on: https://t.co/0gHImE23yj#Adipurush now in cinemas near you ✨… pic.twitter.com/vwIubHPGbKAdipurush continues to captivate audiences across generations, crossing an astounding ₹340 crores on the opening weekend at the box office! Jai Shri Ram 🙏#AdipurushBlockbusterWeekend
— T-Series (@TSeries) June 19, 2023
Book your tickets on: https://t.co/0gHImE23yj#Adipurush now in cinemas near you ✨… pic.twitter.com/vwIubHPGbK
-
రాముడిగా ప్రభాస్.. కారణమదే!
Om Raut Prabhas : ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్.. రాముడి పాత్రలో ప్రభాస్‌ను ఎంపిక చేయడానికి గల కారణాన్ని వివరించారు. రాముడి పాత్ర కోసం ప్రభాస్‌ను ఒప్పించడానికి చాలా కష్టపడినట్లు తెలిపారు. సినిమా చేయాలనుకున్నప్పటి నుంచి ప్రభాస్‌ను మాత్రమే రాముడిగా ఊహించుకున్నట్లు ఓం రౌత్ వివరించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"'ఆదిపురుష్'.. కొత్త తరం ప్రేక్షకుల కోసం తీసిన చిత్రం. మొత్తం రామాయణ మహా కావ్యాన్ని తెరపై చూపించడం సాధ్యం కాని పని. అందుకే యుద్ధకాండను మాత్రమే ఎంచుకున్నాను. నాకు వ్యక్తిగతంగానూ ఇష్టమైన భాగం ఇది. ఇందులో శ్రీ రాముడు పరాక్రమవంతుడిగా కనిపిస్తాడు. అలాంటి పాత్రకు ప్రభాస్ అయితేనే కచ్చితంగా సరిపోతాడని అనుకున్నాను. మన హృదయంలోని భావాలు.. కళ్లలో కనిపిస్తాయనేది నా అభిప్రాయం. ప్రభాస్ కళ్లలో కూడా నీతి, నిజాయతీ కనిపిస్తుంటాయి. అంత పెద్ద స్టార్ అయినా.. చాలా వినయంగా ఉంటారు. అందుకే సినిమా చేయాలని అనుకున్న రోజే రాముడిగా ప్రభాస్ మాత్రమే సరైన వ్యక్తి అని భావించాను. ప్రభాస్‌కు మొదట ఈ విషయం చెబితే ఆయన ఆశ్చర్యపోయారు. ఆయనను ఒప్పించడంలో చాలా కష్టపడ్డా. ఫోన్‌లో పాత్రకు సంబంధించిన వివరాలు చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఒకసారి తనని కలిసి కథ గురించి చెప్పగానే ఓకే అన్నారు ప్రభాస్. చాలా శ్రద్ధగా చేశారు. నాకు అన్ని విధాలుగా సపోర్ట్‌గా నిలిచారు. భవిష్యత్తులోనూ మా ఇద్దరి ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను"
--ఓం రౌత్, ఆదిపురుష్ దర్శకుడు
Adipurush Cast : రామాయణ ఇతిహాసం ఆధారంగా.. మోషన్ క్యాప్చర్ త్రీడీ టెక్నాలజీతో ఈ చిత్రం రూపొందింది 'ఆదిపురుష్'. టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్.. జానకీ దేవిగా కృతి సనన్ నటించారు. అలాగే రావణుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">