Actress Who Died At 17 : ఆమె బాలనటిగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జాతీయ అవార్డులతో పాటు మరెన్నో అత్యున్నత పురస్కారాలను సైతం సొంతం చేసుకున్నారు. అలా అనతికాలంలోనే స్టార్డమ్ సంపాదించుకున్న ఆమె ఇండస్ట్రీలో మంచి నటిగా స్థిరపడుతారని అనుకున్నారంతా. కానీ కాలం మరోలా తలిచింది. తమిళ ఇండస్ట్రీతో పాటు కన్నడలోనూ మంచి విజయాలు సాధించిన ఆమె 17 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ఇంతకీ ఆమె ఎవరంటే ?
శోభగా తెరకు పరిచమైన ఆమె అసలు పేరు మహాలక్ష్మీ మేనన్. 1966లో 'తట్టుంగల్ తిరక్కపదుమ్' అనే తమిళ చిత్రంతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. 1978లో మలయాళ సినిమా 'ఉత్తరాద రాత్రి' ద్వారా హీరోయిన్గా మారారు. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుని అటు మలయాళంతో పాటు ఇటు తమిళ ఇండస్ట్రీలో దూసుకెళ్లారు. 1979 లో 'పాసీ' అనే తమిళ చిత్రానికిగానూ ఆమె జాతీయ ఉత్తమ నటిగా అవార్డును కూడా అందుకున్నారుఇవే కాకుండా కేరళ చిత్ర పరిశ్రమకు చెందిన మూడు ప్రతిష్టాత్మక అవార్డులు (1971లో ఉత్తమ బాలనటి, 1978లో ఉత్తమ నటి, 1979లో ఉత్తమ సహాయ నటి) అవార్డులను అందుకున్నారు. ఇవే కాకుండా రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు 1978లో కన్నడ ,1979 తమిళ చిత్రాలకు గాను ఉత్తమ నటిగా అవార్డులను అందుకున్నారు. తెలుగులోనూ ఆమె 'మనవూరి పాండవులు', 'తరం మారింది' లాంటి సినిమాల్లోనూ నటించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇక కెరీర్లో స్థిరపడుతున్న సమయంలో కోలీవుడ్ డైరెక్టర్ బాలు మహేంద్రతో ప్రేమలో పడ్డారు. అయితే శోభ కంటే బాలు మహేంద్ర 26 సంవత్సరాల పెద్దవాడు. దీంతో వీరి పెళ్లికి కుటుంబసభ్యులు అంగీకరించలేదు.అయినప్పటీకీ వారి మాట లెక్కచేయకుండా ఆయన్ను వివాహం చేసుకున్నారు. అయితే 17 సంవత్సరాల వయసులోనే ఆమె వ్యక్తిగత కారణల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో యావత్ సినీ ఇండస్ట్రీ షాక్కు గురైంది. అయితే ఈమెది ఆత్మహత్య లేక హత్య, అనే విషయం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. ఒకానొక సమయంలో తన భర్త బాలు మహేంద్రే ఆమె హత్య చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే 1983లో శోభ జీవితాన్ని ఆధారంగా చేసుకుని మలయాళంలో 'లేకయుడి మరణం ఓరు ప్లాష్ బాక్' అనే సినిమా వచ్చింది.
Actress Who Acted In 450 Films : 14 ఏళ్లకే పెళ్లి.. 450 చిత్రాల్లో మెరిసిన ఆ నటి ఎవరో తెలుసా?
వయసు పెరిగినా తగ్గని క్రేజ్, సంపాదన- భారత్లోనే రిచ్చెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా?