పైన ఫొటోలో ఉన్న అమ్మాయి నార్త్ ఇండియన్. అయినా దక్షిణాది చిత్రపరిశ్రమలో కొన్ని సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం ఆ తర్వాత తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. వెండితెరకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను అలరిస్తోంది.
ఓ తమిళ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నాని, శర్వానంద్, సందీప్ కిషన్ వంటి హీరోలతో నటించింది. ఇంతకీ ఈ బ్యూటీఫుల్ గర్ల్ ఎవరంటే సురభి. బీరువా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు.. ఎక్స్ ప్రెస్ రాజా, ఎటాక్, జెంటిల్మెన్, ఒక్క క్షణం, శశి వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. చివరిసారిగా ఆ సురభి శశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఎర్ర గులాబీ సైతం అసూయ పడే అందంతో కుర్రాళ్ల మనసులను దోచేసింది. ఈ క్రమంలోనే సురభికి సంబంధించిన చిన్ననాటి ఫోటో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ చూడండి: టాప్లెస్ శ్రియ.. ఓపెన్ హార్ట్ నేహాశెట్టి.. నందిని రాయ్ క్లీవేజ్ షో