ETV Bharat / entertainment

గైక్వాడ్- సయాలీ లవ్!.. క్లారిటీ ఇచ్చిన నటి.. ఏమందంటే? - మరాఠీ నటి సయాలీ సంజీవ్‌క్రికెటర్‌ రుతురాజ్‌

క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్​తో ప్రముఖ మరాఠీ నటి సయాలీ సంజీవ్‌ ప్రేమలో మునిగితేలుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. ఏమన్నారంటే?

sayali sanjeev
రుతురాజ్​ గైక్వాడ్
author img

By

Published : Dec 4, 2022, 8:26 PM IST

సినిమా- క్రికెట్‌ది విడదీయరాని బంధం. సినీతారలు క్రికెటర్స్‌ను ప్రేమించడం, కొన్ని జంటలు పెళ్లిదాకా రాకుండానే మధ్యలోనే బ్రేకప్‌ కావడం, మరికొన్ని మాత్రం వివాహంతో బంధాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అయితే కొందరు వారి ప్రేమను అంగీకరించకుండా..ఇది జస్ట్​ ఫ్రెండ్‌షిప్‌ అని దాచేస్తారు.. మరికొందరి నిజమైన స్నేహాన్ని జనాలు ప్రేమే అని భ్రమపడతారు.
ఇలా సినీతారలు- క్రికెటర్లకు సంబంధించి ఎన్నో వార్తలు నిత్యం నెట్టింట వైరల్​ అవుతుంటాయి. అలా మరాఠీ నటి సయాలీ సంజీవ్‌, క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మధ్య ప్రేమ వ్యవహారం ఉందంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. తాజాగా దీనిపై సయాలీ సంజీవ్‌ స్పందించారు.

'మా మధ్య ఏం లేదు.. ఈ రూమర్స్‌ వల్ల మా స్నేహం దెబ్బతింది. కనీసం మంచి స్నేహితులుగా కూడా మాట్లాడుకోవట్లేదు. అక్కడ ప్రేమాదోమా ఏమీ లేదు. అయినా మమ్మల్ని ఎందుకు లింక్‌ చేస్తున్నారో అర్థం కావట్లేదు. దీని వల్ల మా వ్యక్తిగత జీవితాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఇలాంటి వార్తలు పుట్టించేవాళ్లకు ఎందుకర్థమవట్లేదు? అతడు మంచి ఆటగాడు, దాని గురించి మేం మాట్లాడుకునేవాళ్లం.. కానీ తర్వాత అది కూడా మానేశాం. నిజానికి మా భాగస్వాములను ఎంచుకున్నాకైనా జనాలు మాది స్నేహమని తెలుసుకుంటారులే అనుకున్నా.. కానీ, ఇలాంటి వార్తలు వ్యాప్తి చెందుతుంటే.. ఎప్పటికైనా ఇబ్బందేనని ఆలోచించాం. ఇంట్లోవాళ్లకు కూడా సమస్యేనని అర్థం చేసుకున్నాం. అతడు ఏదైనా విజయం సాధించినప్పుడు కృతజ్ఞత చెప్పాలనిపించినా ఆ పని చేయలేకపోతున్నా. అతనిది కూడా ఇదే పరిస్థితి' అని చెప్పుకొచ్చారు సయాలీ సంజీవ్‌.

ఇవీ చదవండి: హన్సిక పెళ్లికి నిరుపేద పిల్లలు.. ప్రత్యేక అతిథులుగా ఆహ్వానం!

'బంగ్లా టీమ్​తో సిరీస్​ అంత ఈజీ కాదు.. ఆ విషయం ఇప్పుడే చెప్పలేం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.