నాగచైతన్య-కృతిశెట్టి జంట 'బంగార్రాజు'తో ఆకట్టుకుంది. చిన్న సోగ్గాడిగా నాగచైతన్య, సర్పంచి నాగలక్ష్మిగా కృతిశెట్టి సందడి చేశారు. ఆ ఇద్దరూ ఇప్పుడు 'కస్టడీ' కోసం జట్టు కట్టారు. శ్రీనివాసా సిల్వర్‌స్క్రీన్ పతాకంపై రూపొందుతోందీ ద్విభాషా చిత్రం. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో కొత్త అప్డేట్ వచ్చింది. హీరోయిన్ కృతిశెట్టి పాత్రను పరిచయం చేస్తూ ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆమె పేరు రేవతి అని చెప్పారు.
ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకేత్తిస్తోంది. కాగా, ఈ చిత్రానికి శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. అరవింద్ స్వామి, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలై చేసిన నాగచైతన్య లుక్ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. అందులో నాగచైతన్య గాఢతతో కూడిన మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇది చూస్తుంటే యాక్షన్ అంశాలకి పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్న చిత్రం అని స్పష్టమవుతోంది.
పోలీస్ కస్టడీ నేపథ్యంలో సాగే ఈ కథలో నాగచైతన్య.. శివ అనే యువకుడిగా కనిపిస్తారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో సంపత్‌రాజ్, శరత్‌కుమార్, ప్రేమ్‌జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఎస్.ఆర్.కదిర్, కూర్పు: వెంకట్ రాజన్, సంభాషణలు: అబ్బూరి రవి, ప్రొడక్షన్ డిజైన్: రాజీవ్, సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా.
-
Introducing our Charming and Gorgeous @IamKrithiShetty as the Resilient #Revathi🔥 from #Custody ❤️🔥
— Srinivasaa Silver Screen (@SS_Screens) January 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A @vp_offl HUNT💥#CustodyOnMay12@chay_akkineni @thearvindswami @ilaiyaraaja @thisisysr @srinivasaaoffl @realsarathkumar #Priyamani #SampathRaj @SS_Screens @jungleemusicSTH pic.twitter.com/5N96cMCshc
">Introducing our Charming and Gorgeous @IamKrithiShetty as the Resilient #Revathi🔥 from #Custody ❤️🔥
— Srinivasaa Silver Screen (@SS_Screens) January 18, 2023
A @vp_offl HUNT💥#CustodyOnMay12@chay_akkineni @thearvindswami @ilaiyaraaja @thisisysr @srinivasaaoffl @realsarathkumar #Priyamani #SampathRaj @SS_Screens @jungleemusicSTH pic.twitter.com/5N96cMCshcIntroducing our Charming and Gorgeous @IamKrithiShetty as the Resilient #Revathi🔥 from #Custody ❤️🔥
— Srinivasaa Silver Screen (@SS_Screens) January 18, 2023
A @vp_offl HUNT💥#CustodyOnMay12@chay_akkineni @thearvindswami @ilaiyaraaja @thisisysr @srinivasaaoffl @realsarathkumar #Priyamani #SampathRaj @SS_Screens @jungleemusicSTH pic.twitter.com/5N96cMCshc
పోలీస్ లుక్‌లో సుధీర్ బాబు.. హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ 'హంట్'. మహేశ్ సూరపనేని దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓ మర్డర్ మిస్టరీని ఛేదించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్‌బాబు కనిపించారు. కాగా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ట్రైలర్‌ని రిలీజ్ చేశాడు. దాదాపు రెండు నిమిషాల నిడివితో కట్ చేసిన ట్రైలర్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. సుధీర్ బాబు ఒక యాక్సిడెంట్‌కి ముందు యాక్సిడెంట్‌కి తర్వాత చేపట్టిన ఒక కేస్ చుట్టూ సినిమా తిరుగుతోంది అనే విషయాన్ని ట్రైలర్ ద్వారా స్పష్టమౌతోందని నెచిజన్లు కామెంట్ చేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">