ETV Bharat / entertainment

కీర్తి సురేశ్ తీన్మార్ స్టెప్పులు చూశారా?.. రెచ్చిపోయిందిగా!

author img

By

Published : Apr 3, 2023, 9:17 PM IST

Updated : Apr 3, 2023, 10:38 PM IST

దసరా సినిమాలో కీర్తి సురేశ్​ తీన్మార్​ స్టెప్పులకు సంబంధించిన వీడియోను మేకర్స్​ విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. మీరు కూడా ఓ సారి చూసేయండి.

actress keerthy suresh teenmar dance from dasara song video viral

నేచురల్​ స్టార్​ నాని, కీర్తి సురేశ్​ నటించిన దసరా మూవీ హిట్​ టాక్​తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్​ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. అయితే ఈ సినిమాలో కీర్తి సురేశ్ వెన్నెల పాత్ర.. ప్రేక్షకులకు బాగా కనెక్ట్​ అయింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్​లో వచ్చిన ఈ సినిమాలో కీర్తి జీవించేసింది. ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయింది. తాజాగా ఈ సినిమాలో ఆమె వేసిన తీన్మార్ స్టెప్పుల వీడియో వైరల్ అవుతోంది.

సినిమాలో తన పెళ్లి సమయంలో రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తుంది వెన్నెల. మూవీలో ఆమె డ్యాన్స్​ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. తాజాగా ఆ వీడియోను మేకర్స్ సోమవారం రిలీజ్ చేశారు. ఇందులో కీర్తి సురేశ్ రెచ్చిపోయి డ్యాన్స్ చేయడం చూడొచ్చు. మాస్ స్టెప్పులతో ఆమె అలరించింది. బ్యాండ్ బీట్​కు తగినట్లు డ్యాన్స్ చేస్తూ ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్​లో వచ్చిన దసరా సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ.87 కోట్లకు పైగా వసూలు చేసింది. నాని కెరీర్​లో తొలి రూ.100 కోట్ల సినిమాగా నిలువనుంది. ఫస్ట్ వీకెండ్​లో కలెక్షన్ల వర్షం కురిపించిన దసరా మూవీకి ఈ వారం మాత్రం రావణాసుర నుంచి పోటీ ఎదురుకానుంది.

ఇక ఈ సినిమా తాము ఊహించిన దాని కంటే కూడా పెద్ద సక్సెస్ సాధించిందని నేచురల్ స్టార్ నాని అన్నారు. ఉత్తరాదిలో ఆశించిన మేర కలెక్షన్లు రాకపోయినా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అదరగొడుతోంది. ఇందులో ఊర మాస్ క్యారెక్టర్​లో కనిపించిన నాని.. ఇక ఇప్పట్లో ఇలాంటి మాస్ సినిమా మరొకటి చేయబోనని స్పష్టం చేశారు.

తాజాగా ఈ సినిమాపై దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. ఈ మూవీలో నాని తన కెరీర్​లోనే అత్యుత్తమమైన నటనను ప్రదర్శించాడని కొనియాడారు. హీరోయిన్​ కీర్తి సురేశ్​​ కూడా వెన్నెల క్యారెక్టర్​లో ఒదిగిపోయి అవలీలగా నటించందంటూ మెచ్చుకున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. వాస్తవ ప్రపంచంలో పాత్రల మధ్య హృదయానికి హత్తుకునే ఓ గొప్ప లవ్ స్టోరీని తెరకెక్కించారని ప్రశంసించారు.

ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించారు రాజమౌళి. అద్భుతమైన విజయాన్ని అందుకున్న దసరా చిత్ర బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అంతకుమందు టాలీవుడ్​ స్టార్​ హీరోలు ప్రభాస్​, మహేశ్​ బాబు కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

నాని నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం 'దసరా'. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరోయిన్​గా అలరించింది. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30న మొత్తం 5 భాషల్లో విడుదలైన ఈ చిత్రం వరల్డ్​ వైడ్​గా దాదాపు 3 వేలకుపైగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. రిలీజైన మొదటి​ రోజు నుంచే తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

Last Updated : Apr 3, 2023, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.