ETV Bharat / entertainment

సూపర్ హిట్ సాంగ్​కు రాఖీ భాయ్​ యశ్‌ డ్యాన్స్​.. వీడియో చూశారా? - సుమలత కొడుకు పెళ్లి

Actor Yash Dance : స్టార్‌ హీరోలు యశ్‌-దర్శన్‌ కలిసి ఓ సూపర్ హిట్ సాంగ్​కు అదిరిపోయే డ్యాన్స్​ వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. మీరు చూశారా?

Yash dance
హిట్ సాంగ్​కు యశ్‌ డ్యాన్స్​.. వీడియో చూశారా?
author img

By

Published : Jun 11, 2023, 1:54 PM IST

Actor Yash Dance : రాకీ భాయ్​ యశ్​ సిల్వర్​ స్క్రీన్​పై కనిపించి చాలా కాలం అయిపోయింది. కేజీయఫ్ సిరీస్​తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఆయన కొత్త సినిమా అప్డేట్​ కోసం యావత్​ భారత దేశమంతటా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి కానీ ఇంకా ఏదీ ఓ క్లారిటీ రాలేదు. అయితే తాజాగా యశ్​ ఓ వేడుకలో డ్యాన్స్​లు వేస్తూ సరదాగా కనిపించారు. తన తోటి హీరో దర్శన్​తో కలిసి చిందులేశారు. అది చూసిన నెటిజన్లు, అభిమానులు ఎంతో సంతోషపడిపోతున్నారు. తెగ మురిసిపోతున్నారు. ఆ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు.

ఆ పార్టీలో..

Sumalatha son wedding : సీనియర్‌ నటి, ఎంపీ సుమలత కుమారుడు అభిషేక్‌ వివాహం రీసెంట్​గా గ్రాండ్​గా జరిగింది. బెంగుళూర్‌లోని ఓ ప్యాలెస్‌లో.. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రసాద్‌ బిదపా కుమార్తె అవివాతో అతడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో సుమలత.. తాజాగా ఓ గ్రాండ్‌ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి నటీ నటులంతా హాజరై సందడి చేశారు.

అందులోనే స్టార్‌ హీరోలు యశ్‌-దర్శన్‌లు.. సుమలత, కొత్త జంటతో కలిసి స్టేజ్​పై చిందులేశారు. ఒకరి చేయి ఇంకొకరు పట్టుకుని స్టెప్పులేశారు. వచ్చిన వారిలో ఉత్సాహాన్ని నింపారు. వీరంతా కలిసి విజయ్‌ప్రకాశ్‌ హిట్‌ సాంగ్‌ 'జలీల' సాంగ్​కు.. స్టెప్స్‌లు వేశారు. ముఖ్యంగా యశ్​ మరింత ఉత్సాహాన్ని నింపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో ఫుల్​ ట్రెండ్‌ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు తెగ లైక్స్​ కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఈ పార్టీకి ముందు సుమలత.. ఏర్పాటు చేసిన వివాహ విందుకు ఇంకొంతమంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. మెగాస్టార్​ చిరంజీవి-సురేఖ దంపతులు, దర్శన్‌, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ సీఎం యడియూరప్ప, శత్రుఘ్నసిన్హా, రమ్య, ఖుష్బూ, జాకీష్రాఫ్‌ వంటి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Yash new movie : రాకింగ్ స్టార్​ హీరో యశ్​ 'కేజీయఫ్' సిరీస్​​ తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. అయితే ఆయన త్వరలోనే.. టాలీవుడ్-బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్​-మధు మంతెన నిర్మించబోయే 'రామాయణం' సినిమాలో రావణాసురిడిగా నటించబోతున్నారనే వార్త జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో బాలీవుడ్​ స్టార్ రణ్​బీర్ కపూర్ రాముడిగా.. ఆలియా భట్​ సీతగా కనిపించనున్నారట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. ఈ ఏడాది చివర్లో సినిమా సెట్స్​పైకి వెళ్లనున్నట్లు ఇటీవలే నిర్మాత మధు మంతెన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇదీ చూడండి :

సిల్వర్​స్క్రీన్​పై మరో రామాయణం.. నటీనటులు వీళ్లేనట!

రాకీ భాయ్​ యశ్ సినిమాల కోసమే ఇంటి నుంచి పారిపోయాడంట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.