'ప్యార్ కా పంచనామా'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, మొదటి సినిమాతో మహిళల్లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న బాలీవుడ్ యువ కథానాయకుడు కార్తిక్ ఆర్యన్. కెరీర్ ఆరంభంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న కార్తిక్ ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవలే 'భూల్ భులయ్యా 2' మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆయన.. అతడు ప్రస్తుతం 'సత్యప్రేమ్ కీ కథ' షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో కియారా అడ్వాణీ, కార్తిక్ సరసన నటిస్తోంది. అయితే ఆర్యన్.. త్వరలోనే తాను నటించిన 'ఫ్రెడ్డీ' చిత్రంతో డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హాట్‌స్టార్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో పాల్గొన్న అతడు ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. ఎప్పుడు స్లిమ్‌గా క్లాస్‌గా కనిపించే ఈ హీరో.. ఈ సినిమాలోని తన పాత్ర కోసం ఏకంగా 14కిలోల బరువు పెరిగాడట. చాలా కష్టపడ్డాడట.
"ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను. దీనికోసం నిద్రలేని రాత్రులెన్నో గడిపాను. నటీనటులు తమలోని భిన్నమైన, పూర్తి నటుడిని బయటకు తీసుకొచ్చేందుకు ఇటువంటి అవకాశాలు అరుదుగా దొరుకుతాయి. ఫ్రెడ్డీ చిత్రంలో నా పాత్ర కూడా అలాంటిదే" అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఫ్రెడ్డీ చిత్రానికి శశాంక ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలాజీ టెలిఫిలిమ్స్, నార్తర్న్ లైట్స్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో అలయ ఎఫ్ కూడా మరో కీలక పాత్రలో నటించింది.
ఇవీ చదవండి:మలైక యస్ చెప్పింది అర్జున్‌కు కాదా అసలు విషయం ఏంటంటే