Actor banarjee open ups on MAA controversy : గతేడాది జరిగిన మా ఎన్నికలు ఎంతో రసవత్తరంగా సాగాయి. ఈ ఎలక్షన్స్‌లో ప్రకాశ్‌రాజ్‌పై గెలిచిన విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మొత్తంగా ఈ ఎన్నికలు ఆద్యంతం వివాదాలతోనే ముగిసింది. అయితే ఎన్నికల సమయంలో మోహన్‌బాబుతో జరిగిన గొడవపై తాజాగా మాట్లాడారు సీనియర్ నటుడు బెనర్జీ.
'మోహన్ బాబు మీపై చేయి చేసుకున్నారా' అని అడిగిన ప్రశ్నకు ఆయన కళ్లు తుడుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ విషయం గురించి ఇంకేం మాట్లాడదలుచుకోలేదని ఇక మోహన్ బాబు విజ్ఞతకే ఆ విషయాన్ని వదిలేశానని చెప్పారు.కాగా, ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లోని తనీష్‌ను మోహన్ బాబు తిట్టారని, ఆ సమయంలో తాను అక్కడికి వెళ్లి, గొడవలొద్దని విష్ణుతో చెప్పగా.. వెంటనే మోహన్ బాబు తనను కొట్టడానికి వచ్చారని బెనర్జీ అప్పట్లో అన్నారు. దాదపు అరగంటపాటు బూతులు తిడుతూనే ఉన్నారని చెప్పారు.40 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నన్ను అలా తిట్టేసరికి షాక్ లో ఉండిపోయానని అప్పుడు కూడా కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చదవండి:
'కోబ్రా'కు కత్తిరింపులు.. ఓటీటీలోకి 'విక్రాంత్ రోణ'
ప్రభాస్ ప్రాజెక్ట్ కెలో మరో ముగ్గురు స్టార్ హీరోలు, ఇక ఫ్యాన్స్‌కు పండగే