ETV Bharat / entertainment

నిర్మాతల మండలి కీలక నిర్ణయాలు.. రెమ్యునరేషన్​ తగ్గించుకోకుండానే.. - కీలక నిర్ణయాలు

తెలుగు సినిమా పరిశ్రమ నిర్మాతల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఓటీటీ, టిక్కెట్ల ధరలు, సినిమా హాల్లో తిసుబండారాల ధరలు మొదలైన విషయాల్లో తీర్మానాలు చేశారు. ఇటీవల నెల రోజుల పాటు షూటింగ్స్ నిలిపివేసిన అనంతరం, పరిశ్రమ సమస్యలపై నిర్మాతల మండలి సమావేశమైంది. ఇందులో ప్రముఖ నిర్మాతలతో పాటు 33 మంది ఉన్నారు. ప్రేక్షకుడిపై భారం పడకుండా ఉండేలా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Producers Guild Telugu
active telugu film producers guild latest meeting outcomes
author img

By

Published : Sep 1, 2022, 6:22 PM IST

Producers Guild Telugu : నటీనటుల పారితోషకాలు తగ్గించుకోకుండానే నిర్మాణ వ్యయాలకు కళ్లెం వేసేలా తెలుగు 'నిర్మాతల మండలి' కీలక నిర్ణయాలు తీసుకుంది. సినీ పరిశ్రమలోని ప్రధాన సమస్యల పరిష్కారం కోసం నెల రోజులు షూటింగ్స్ నిలిపివేసింది నిర్మాతల మండలి. అనంతరం చర్చలు జరిపి ప్రేక్షకుడిపై భారం వేయకూడదనే తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా మంచి కంటెంట్ తో సినిమాలను విడుదల చేయడం.. 8 వారాల తర్వాతే ఓటీటీకి కొత్త సినిమాలను ఇవ్వాలని అంతిమంగా నిర్ణయించారు. అలాగే మల్టీఫ్లెక్స్​లు, సాధారణ థియేటర్లలో తినుబండారాల ధరలను తగ్గించాలని తీర్మానించారు. అయితే టికెట్ ధరల విషయంతోపాటు ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య రెవెన్యూ వాటాల విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది.

8 వారాల తర్వాతే ఓటీటీకీ..
తెలుగు సినీ పరిశ్రమను గాడిన పెట్టేందుకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి పక్కా ప్రణాళికతో ముందడుగు వేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ పర్యవేక్షణలో 33 మంది నిర్మాతలంతా ఏకాభిప్రాయంతో నెల రోజులుగా షూటింగ్స్ నిలిపివేశారు. ప్రధాన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఓటీటీ, టికెట్ ధరలు, నిర్మాణ వ్యయాలు, వీపీఎఫ్ ఛార్జీలు, కంటెంట్, కార్మికుల వేతనాల పెంపుపై కమిటీల వారీగా ఏర్పడ్డారు. పరిశ్రమలోని అన్ని విభాగాలతో చర్చలు జరిపారు. అందులో భాగంగా సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ.. ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా చేస్తోన్న ఓటీటీలకు తాత్కాలికంగా అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. గత రెండు మాసాల్లో ఒప్పందం చేసుకున్న సినిమాలు కాకుండా ఇకపై విడుదల చేసే సినిమాలను తప్పనిసరిగా 8 వారాల తర్వాతే ఓటీటీకీ ఇవ్వాలని తీర్మానించారు. అయితే ఇందులో పెద్ద, చిన్న సినిమా అనే తేడా లేకుండా.. నిర్మాతలంతా 'నిర్మాతల మండలి' నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు. ఒకవేళ సినిమా పరాజయం పొంది నిర్మాతకు భారీ నష్టాన్ని చేకూర్చే పరిస్థితితి తలెత్తితే.. నిర్మాతల మండలిని సంప్రదించి నిర్ణయం తీసుకోవచ్చని తీర్మానించినట్లు తెలుస్తోంది.

ఖర్చులు తగ్గించాలి..
ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే క్రమంలో కథల విషయంలో మరింత దృష్టి సారించాలని నిర్ణయించారు. ప్రత్యేకంగా అగ్ర దర్శకుల నుంచి యువ దర్శకులందరితోనూ నిర్మాతల మండలి సమావేశమైంది. దర్శకులకు పలు సూచనలు చేసింది. సినిమా విడుదల తేదీలతోపాటు బడ్జెట్ అంశాలపై దృష్టి పెట్టకుండా కథ, కథనాలు, నటీనటుల ఎంపికపై ఎక్కువ సమయాన్ని కేటాయించాలంది. అలాగే ముందస్తుగా నిర్ణయించుకున్న రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేసి.. నిర్మాతలకు బడ్జెట్ భారం కాకుండా చూసుకోవాలని నిర్దేశించింది. షూటింగ్ సహా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాకే విడుదల తేదీలపై ఆలోచించాలని సూచించింది. సినిమా బడ్జెట్ పెరిగిపోయిందన్న వాదనలు వినిపించకుండా అదుపు తప్పే వ్యయాలకు కళ్లెం వేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ప్రస్తుత మార్కెట్ ప్రకారం నటీనటుల పారితోషకాలను ఇవ్వడం, చిన్న, మధ్య తరహా నటీనటులకు సహాయకులతో సంబంధం లేకుండా ప్యాకేజీ రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. నటీనటుల కాల్షిట్లు, సినిమా షెడ్యూల్స్ విషయంలోనూ కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ విషయంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తోనూ చర్చించి ఒప్పందం కూడా చేసుకున్నట్లు నిర్మాతల మండలి ప్రకటించింది. నటీనటుల మేనేజర్ల వ్యవస్థపై పరిశ్రమలో తరచు ఆరోపణలు రావడంతో వారితోనూ చర్చించి హెచ్చరించింది.

ధరలు అందుబాటులో ఉండాలి..
అత్యంత ప్రధాన సమస్యగా భావించే సినిమా టికెట్ ధరల విషయంలోనూ ఆచితూచి వ్యవహారించాలని నిర్మాతల మండలి భావిస్తోంది. టికెట్ ధరల పెంపు, తగ్గింపు వల్ల గతంలో తలెత్తిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రేక్షకుడిపై భారం వేయకుండా టికెట్ ధరలను స్థిరీకరించాలని నిర్ణయించారు. సినిమా బడ్జెట్, ప్రాంతాల ప్రాతిపాదికన సినిమా టికెట్ ధరలను అందుబాటులో ఉంచాలని నిర్మాతలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. సామాన్య ప్రజలు కూడా మల్టీఫ్లెక్స్ ల్లోనూ సినిమా వీక్షించేందుకు ఇష్టపడుతున్న క్రమంలో అన్ని మల్టీఫ్లెక్స్ ల్లోనూ సాధ్యమైనంత తక్కువ ధరకే టికెట్ ధరలు, తినుబండారాలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఈ విషయంపై మల్టీప్లెక్స్ జాతీయ ప్రతినిధులు కూడా సానుకూలంగా స్పందించారని నిర్మాతల మండలి చెబుతోంది.

స్పష్టత రాని వీపీఎఫ్​ అంశం..
పరిశ్రమలో అంతర్గతంగా ఇటీవల ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మధ్య వీపీఎఫ్ ఛార్జీలు, రెవెన్యూ వాటాల విషయం తలనొప్పిగా మారింది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం పలు ధపాలుగా చర్చలు జరిపినా అటు ఎగ్జిబిటర్లు, ఇటు నిర్మాతలు పట్టువీడటం లేదు. దీంతో ఈ నెల 3న డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లైనా క్యూబ్, యూఎఫ్ఓ సంస్థల సీఈవోలతో సమావేశమై వర్చువల్ ప్రింట్ ఫీజు(వీపీఎఫ్​) సమస్యకు ముగింపు పలకాలని నిర్ణయించింది. రెవెన్యూ వాటాల విషయంలో థియేటర్లకు అద్దె చెల్లిస్తామని నిర్మాతలు కోరుతుండగా పర్సంటేజీల ప్రకారమే సినిమాలను ఆడించాలని ఎగ్జిబిటర్లు పట్టుపడుతున్నారు. దీంతో ఈ వివాదంపై ఇంకా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

సినీ కార్మికులకు తీపికబురు..
మూడేళ్ల నుంచి వేతనాలు పెంచలేదని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన సినీ కార్మికులకు నిర్మాతల మండలి తీపికుబరు అందించింది. కార్మికులు డిమాండ్ చేస్తోన్న 30 శాతం వేతనాలనూ మూడు విడతలుగా పెంచేందుకు నిర్మాతల మండలి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయాలన్నీ సినీ పరిశ్రమకు వెల్లడించేందుకు తుది సమావేశం నిర్వహిస్తోన్న క్రమంలో దిల్ రాజు అనారోగ్యానికి గురయ్యారు. దిల్ రాజు కోలుకున్నాక ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయాలను అధికారికంగా ప్రకటిస్తామని తెలుగు నిర్మాతల మండలి చెబుతోంది.

ఇవీ చదవండి: వైరల్​గా ప్రభాస్​-కృతిసనన్​ ఆడియో కాల్​​, అసలేం మాట్లాడుకున్నారంటే..

ఆ విషయంలో నేనూ బాధితుడినే: చిరంజీవి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.