Aata Sandeep Bigg Boss 7 : బిగ్‌బాస్ సీజన్ - 7 నుంచి ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్‌లో భోలే షావలి, శోభాశెట్టి, అ శ్విని, శివాజీ, అమర్‌దీప్, ప్రియాంక, గౌతమ్ ఉండగా, సందీప్.. వీరిలో చివరకు సందీప్, శోభాశెట్టి మిగిలారు. అయితే వీరిద్దరిని ఓ గదిలో కూర్చొబెట్టి వాళ్ల చేతులకు ప్యాచ్‌ను అతికించుకోమని చెప్పారు హోస్ట్ నాగార్జున. కౌంట్‌డౌన్ మొదలయ్యాక ఇద్దరీ హార్ట్ బీట్ ప్లాస్మా టీవీపై కనిపిస్తుందని చెప్పారు. వారిద్దరిలో ఎవరి హార్ట్ బీట్ అయితే కొనసాగుతుందో వాళ్లు సేఫ్ అని, హార్ట్ బీట్ ఆగిన పోయిన వారు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. ఈ క్రమంలోనే సందీప్ హార్ట్ బీట్ ఆగిపోయినట్లు చూపించడం వల్ల హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు నాగ్ అనౌన్స్ చేశారు. సందీప్ ఎలిమినేషన్‌తో తేజ, శోభ, ప్రియాంక ఎమోషనల్ అయ్యారు.
కాగా, బిగ్ బాస్ హౌస్‌లో మొదటి విడుతలో 14 మంది ఎంట్రీ ఇవ్వగా.. అందులో ఆట సందీప్ ఒకరు. ఎంట్రీ మొదటి నుంచే ఆయన ఆటతీరు ఆడియెన్స్‌ను బాగానే ఆకట్టుకుంది. హౌస్‌లో మొదటి పవర్ అస్త్ర సాధించిన వ్యక్తి కూడా ఆట సందీపే. సందీప్.. ఆ తర్వాత సంచాలక్‌గా కూడా వ్యవహారించారు. అలా ఉండటం వల్ల ఆయన నామినేషన్స్‌లోకి రాలేదు. బిగ్బౌస్ చరిత్రలో సంచాలక్‌గా ఎక్కువ తప్పులు చేసిన వ్యక్తిగానూ రికార్డుకెక్కారు.
అయితే ఐదో వారంలో అర్జున్ అంబటి, పూజా మూర్తి, నయని పవని, బోలే షవాలి, అశ్విని శ్రీ అనే కంటెస్టెంట్స్ ఎంట్రీ ఉన్నారు.వీరిలో అర్జున్ అంబటి మొదటి సారి సందీప్‌ను నామినేట్ చేశారు. కానీ ఊహించని విధంగా గౌతమ్ సీక్రెట్ రూమ్ నుంచి ఎంట్రీ ఇచ్చి.. సందీప్‌ను కాపాడాడు. అలా ఐదో వారం నామినేషన్స్ నుంచి సందీప్ తప్పించుకున్నాడు. ఆరో వారంలోనూ నామినేట్ అయినప్పటికీ.. బిగ్ బాస్ సింగిల్ ఓట్ కౌంట్ చేయకపోవడం వల్ల.. మళ్లీ సందీప్ సేవ్ అయ్యాడు. మొత్తంగా 8 వారాలుగా సేవ్ అవుతూ వచ్చి.. బిగ్ బాస్ హౌస్ చరిత్రలోనే 8 వారాలు నామినేషన్లో లేని కంటెస్టెంట్‌గా రికార్డుకెక్కాడు.
Aata Sandeep Bigg Boss 7 Remuneration : ఈ ఎనిమిది వారాలకు ఆట సందీప్ భారీగానే పైసలు తీసుకున్నట్లు తెలిసింది. వారానికి రూ.2.50 లక్షలు తీసుకున్నారట. అలా 8 వారాలు షోలో కొనసాగిన ఆట సందీప్.. దాదాపు రూ.20 లక్షల రూపాయలు అందుకున్నారని బయటక టాక్ వినిపిస్తోంది.
Bigboss Pooja Murthy : బిగ్‌బాస్ నుంచి పూజా మూర్తి ఔట్.. రెండు వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?
Bigg Boss Subhashree : బిగ్‌బాస్ హౌస్ నుంచి క్యూటీ ఔట్.. 5వారాలకు ఎంత ఛార్జ్ చేసిందో తెలుసా?