ETV Bharat / entertainment

2024 Pan India Movies : టాలీవుడ్​ నుంచి ఆ 5 సినిమాలు ఒకే.. కానీ ఇవి మాత్రం కాస్త డౌటే! - అల్లు అర్జున్ పుష్ప 2 రామ్​ చరణ్ గేమ్​ ఛేంజర్​

2024 Pan India Movies : ఈ ఏడాది టాలీవుడ్​ నుంచి సరైన పాన్ ఇండియా సినిమా ఒక్కటి కూడా రిలీజవ్వలేదు! కొన్ని చిత్రాలు పాన్ ఇండియా ట్యాగ్​తో వచ్చినా అవి ఆకట్టుకోలేదు. కానీ వచ్చే ఏడాది 2024 మాత్రం స్టార్​ హీరోల పాన్ ఇండియా చిత్రాలు వరుసగా రానున్నాయి. అయితే వీటిలో కొన్ని ఇండియా వైడ్​గా భారీ సక్సెస్​ అందుకుంటాయని చెప్పడం కాస్త కష్టమే అనిపిస్తోంది! ఆ వివరాలు..

2024 Pan India Movies : టాలీవుడ్​ నుంచి ఆ 5 సినిమాలు ఒకే.. కానీ ఇవి మాత్రం కాస్త డౌటే!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 7:15 PM IST

2024 Pan India Movies : ప్రస్తుతం కొనసాగుతున్న పాన్ ఇండియా ట్రెండ్​లో​ 2021, 2022 టాలీవుడ్​ నుంచి ఈ పాన్ ఇండియా చిత్రాలు బాగానే రిలీజైనప్పటికీ 2023 మాత్రం ఒక్క సరైన పాన్ ఇండియా మూవీ థియేటర్లలో కనపడలేదు. అయితే 2024 మాత్రం అలా కాదు. తెలుగు చిత్ర పరిశ్రమ​ నుంచి దాదాపు డజన్​కు పైగా పాన్ ఇండియా సినిమా ఎంటర్​టైన్​ చేసేందుకు రెడీ అయిపోతున్నాయి. వీటిలో స్టార్ హీరోల చిత్రాలు కూడా చాలానే ఉన్నాయి.

అయితే ఈ చిత్రాల్లో కొన్ని పాన్ ఇండియా రేంజ్​లో బలంగా హిట్ కొట్టే రేంజ్​లో కనిపిస్తుండగా.. మరికొన్ని చిత్రాలు మాత్రం ఇండియా వైడ్​గా సకెస్స్​​ అందుకోవాలంటే కాస్త గట్టి సవాల్​నే ఎదుర్కోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రశాంత్ వర్మ మైథాలాజికల్​ హనుమాన్​ మూవీ.. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్​ కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలకు వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలో ఈ సినిమా నార్త్​లోనూ మంచి సక్సెస్​​ అందుకుంటుందని అందరూ బలంగా నమ్ముతున్నారు. మరో కార్తికేయ 2 లేదా కాంతార రేంజ్​లో విజయాన్ని, కలెక్షన్లను అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

ఇక అల్లు అర్జున్ పుష్ప 2, ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్​ ఛేంజర్ 2, ప్రభాస్ కల్కి ఈ చిత్రాలన్నీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇవన్నీ ఊహించని రేంజ్​లో భారీ విజయాన్ని నమోదు చేస్తాయని​ అంతా గట్టిగా ఆశిస్తున్నారు. ఈ చిత్రాల కాంబినేషన్స్​, స్టోరీ బ్యాక్​డ్రాప్​, బడ్జెట్స్​​.. తదితర అంశాలన్నీ కలిపి ఈ స్థాయి అంచనాలను పెంచాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అయితే టాలీవుడ్ నుంచి కూడా మరి కొన్ని చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్నాయి. వీటిలో వెంకటేశ్ సైంధవ్, రామ్​ పోతినేని - పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్​, యంగ్​ హీరోలైన నిఖిల్ స్వయంభు, అడివి శేష్ గూఢాచారి 2, విజయ్ దేవరకొండ వీడీ 12, నాగచైతన్య సాయిపల్లవి మూవీ.. ఇకపోతే ప్రభాస్-మారుతి సినిమా, పవన్ కల్యాణ్ ఓజీ, హరిహర వీరమల్లు కూడా వస్తున్నాయి. ఈ చిత్రాలన్నీ మంచి బజ్​తో పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలైనప్పటికీ.. దేశ వ్యాప్తంగా భారీ సక్సెస్​ను అందుకుంటాయని చెప్పడం కష్టమే. టాలీవుడ్​ వరకు మాత్రమే ఇవి సక్సెస్​ అందుకోవచ్చని అంటున్నారు. పాన్ ఇండియా రేంజ్​లో అంటే పెద్ద సవాలే అని అభిప్రాయపడుతున్నారు.

కానీ ఈ చిత్రాల్లో నిఖిల్ స్వయంభు, అడివి శేష్ గూఢాచారి 2కు మాత్రం కాస్త ఎక్కువ పాజిటివ్​ టాక్ వినిపిస్తోంది. ఈ రెండు మాత్రం పాన్ ఇండియా రేంజ్​లో పెద్ద విజయాన్ని నమోదు చేసే అవకాశాలు ఉండొచ్చని అంటున్నారు. చూడాలి మరి ఈ చిత్రాలన్నీ ప్రేక్షకుల్ని ఎంత వరకు ఆకట్టుకుంటాయో, ఎలాంటి రిజల్ట్​ను అందుకుంటాయో...

Bhagavanth Kesari Movie : 8 నెలలు.. 24 అద్భుత లొకేషన్స్​.. 12 భారీ సెట్స్​.. 'భగవంత్ కేసరి' సర్​ప్రైజ్ వీడియో​ వచ్చేసిందోచ్​

Skanda Movie Urvashi Rautela : బంగారు బొమ్మలా మెరిసిపోతున్న 'స్కంద' బ్యూటీ​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.