ETV Bharat / entertainment

డిసెంబర్​లో బాక్సాఫీస్‌కు వసూళ్ల కళ - ఆ సినిమాలపై భారీ అంచనాలు! - 2023లో విడుదలైన టాలీవుడ్ సినిమాలు

2023 Tollywood Movies : ఈ ఏడాది బాక్సాఫీస్​ ఎన్నో సినిమాలు విడుదలై సందడి చేశాయి. అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకులను అలరించాయి. కానీ డిసెంబరు మాత్రం ఎంతో ప్రత్యేకంగా సాగనుంది. ఎన్నడూ లేని విధంగా ఈ నెలలో కీలకమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 2023లో టాలీవుడ్​లో సినిమాల జర్నీ ఎలా సాగిందంటే ?

2023 Tollywood Movies
2023 Tollywood Movies
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 4:39 PM IST

Updated : Dec 4, 2023, 5:53 PM IST

2023 Tollywood Movies : 2023 ముగిసేందుకు ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంది. మరో కొత్త ఏడాదికి వెలకమ్​ చెప్పేందుకు సమయం ఆసన్నమైంది. దీంతో ప్రతి ఒక్కరు క్రిస్మస్​, న్యూ ఇయర్​ను గ్రాండ్​గా జరుపుకునేందుకు ఎదురు చూస్తున్నారు. ఇక మూవీ స్టార్స్​ కూడా డిసెంబర్​లో తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించి కొత్త సంవత్సరాన్ని తీయ్యని కబురుతో శుభారంభం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ వింటర్ క్యాలెండర్​ మొత్తం సినిమాలతో నిండిపోయింది. చిన్న పెద్దా తేడా లేకుండా అన్ని జానర్స్​ సినిమాలు తెరపై వెలిగేందుకు రెడీగా ఉన్నాయి. అయితే ఎన్నడూ లేని విధంగా ఈ నెలలో పలు కీలకమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. మరీ ఈ ఏడాది ఎలా సాగిందంటే..

సంక్రాంతి బరిలో అగ్ర తారల సినిమాలు పోటీ పడ్డాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేర్​ వీరయ్య', నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి', అజిత్​ 'తెగింపు', విజయ్​ 'వారిసు' సినిమాలు భారీ బడ్జెట్​తో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ నాలుగు సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ టాక్​ అందుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా అందుకున్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరీలో చిన్న చిత్రాలు సందడి చేశాయి. అందులో 'రైటర్​ పద్మ భూషణ్​', 'సార్​' సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. 'అమిగోస్​', 'మైఖెల్​', మాత్రం అంచనాలను అందుకోలేకపోయాయి. ఇక 'వినరో భాగ్యము విష్ణు కథ' మాత్రం మిక్స్​డ్ టాక్​తో సాగింది.

ఇక మార్చిలో విడుదలైన 'బలగం', 'దసరా' సినిమాలు కూడా బాక్సాఫీస్​ వద్ద సెన్సేషన్​ క్రియేట్ చేశాయి. అయితే 'విరూపక్ష' మినహా ఏప్రిల్​లో చెప్పుకోదగ్గ హిట్​ మూవీస్ లేకపోవడం సినీ ప్రియులను నిరాశకు గురిచేసింది. 'శాకుంతలం', 'రావణాసుర', 'కిసీకా భాయ్​ కిసీ కీ జాన్​', 'ఏజెంట్​' సినిమాలు బాక్సాఫీస్​ వద్ద ఆశించిన స్థాయిలో టాక్​ అందుకోలేకపోయాయి.

వేసవిలో దాదాపు 13 సినిమాలు పోటీ పడ్డాయి. అందులో 'కస్టడీ', 'రామబాణం', 'మళ్లీ పెళ్లి' మాత్రం మిక్స్​డ్​ టాక్ అందుకోగా..'ఉగ్రం' సినిమా మాత్రం సర్​ప్రైజ్​ సక్సెస్​గా నిలిచింది. ఇక డార్లింగ్​ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన 'ఆదిపురుష్​' మూవీ జూన్​లోనే విడుదలైంది. బాక్సాఫీస్​ వద్ద మంచి కలెక్షన్లు అందుకున్నప్పటికీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇక చిన్న బడ్జెట్​తో తెరకెక్కిన 'ఇంటింటి రామాయణం', 'మేమ్​ ఫేమస్'​ లాంటి సినిమాలు కంటెంట్​ పరంగా మంచి మార్కులు కొట్టేశాయి. ఇక 'సామజవరగమన' మాత్రం సూపర్​హిట్​గా నిలిచింది.

మరోవైపు జూన్, జులైలో మాత్రం డజనుకు పైగా సినిమాలు విడుదలైయ్యాయి. అందులో 'బేబీ', బ్రో సినిమాలు బాక్సాఫీస్​ వద్ద కాసుల వర్షం కురిపించాయి. 'భోళా శంకర్​', 'బెదురులంక 2012', 'గాండీవధారి అర్జున' సినిమాలు ఆగస్టు బాక్సాఫీస్​ బరిలోకి వచ్చాయి. అయితే అందులో 'బెదురులంక' తప్ప మిగతా రెండు సినిమాలు హిట్ మార్క్​ను అందుకోలేకపోయాయి. మరోవైపు డబ్బింగ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'జైలర్​' అనూహ్య విజయాన్ని అందుకుని బాక్సాఫీస్​ షేక్​ చేసింది.

ఇక సెప్టెంబర్​లో విడుదలైన 'ఖుషి', 'స్కంద', 'పెదకాపు 1' మిక్స్​డ్​ టాక్​ అందుకున్నాయి. అయితే 'మిస్​ శెట్టి మిస్టర్​ పొలిశెట్టి' మాత్రం ఇటు భారత్​తో పాటు అటు ఓవర్సీస్​లోనూ దూసుకెళ్లింది. ఇదే నెలలో విడుదలైన 'జవాన్' సినిమా కూడా ఇండస్ట్రీ హిట్​గా నిలిచింది. అక్టోబర్​లో వచ్చిన 'భగవంత్ కేసరి', నవంబర్​లో విడుదలైన 'మా ఊరి పొలిమేర 2' , 'కోటబొమ్మాళి పీఎస్​', 'మంగళవారం' సినిమాలు మంచి టాక్ అందుకుని కలెక్షన్ల పరంగానూ జోరు చూపించాయి.

అలా 11 నెలలు కొంచం ఇష్టం కొంచం కష్టంగా గడిచిపోగా.. డిసెంబర్​ మాత్రం రెట్టింపు జోష్​ను ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. 'యానిమల్' హిట్​తో శుభారంభం కాగా.. 'సలార్​', 'డంకీ', 'హాయ్​ నాన్న', 'ఎక్స్‌ట్రా- ఆర్డినరీమేన్‌' సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో మూవీ లవర్స్​ కూడా తమ ఫేవరట్ హీరోలకు బ్రేక్ ఇచ్చేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదే జోరు ఈ నెలంతా కొనసాగిందంటే 2023 విజయవంతంగా ముగిసినట్టే అని విశ్లేషకులు అంటున్నారు.

114 రోజుల్లో షూటింగ్​ - ఆ సీక్రెట్​ రివీల్​ చేసిన 'సలార్' డైరెక్టర్​!

'నాన్న' మెప్పిస్తాడా?- ఈ వారం థియేటర్​/ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్​సిరీస్​లివే!

Last Updated : Dec 4, 2023, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.