Oscor WillSmith: హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ అంటే సినీ ప్రియులకు తప్ప ఇంకెవరికీ పెద్దగా పరిచయం లేదు. కానీ ఇటీవల జరిగిన ఆస్కార్ వేడుకల్లో హోస్ట్, కమెడియన్ క్రిస్‌రాక్‌పై చేయి చేసుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అనంతరం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడమే కాకుండా.. సర్వత్రా చర్చకు దారితీసింది. విల్ స్మిత్ కూడా తాను చేసింది తప్పేనని క్రిస్ రాక్‌కు తర్వాత క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా అకాడమీ.. అతడిపై 10 ఏళ్ల పాటు నిషేధం విధించింది. తన భార్య జాడా పింకెట్‌పై.. క్రిస్ రాక్ కామెంట్ చేసినందుకు గాను.. విల్ స్మిత్ అతడిని చెంపదెబ్బ కొట్టారు. ఇదిలా ఉంటే.. విల్ స్మిత్-జాడా దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లు హాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
మాయని మచ్చగా.. గత నెలలో ఆస్కార్ వేడుకల్లో జరిగిన ఘటన వల్ల ఇరువురు విడాకులు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ గొడవ వీరిద్దరి వ్యక్తిగత జీవితంలో మాయను మచ్చలా మిగిలిందని.. దీంతో ఇరువురి మధ్య విభేదాలు వచ్చాయని ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఒకవేళ ఈ వార్తలు నిజమై విల్ స్మిత్ దంపతులు విడాకులు తీసుకుంటే మాత్రం.. చరిత్రలోనే అత్యంత హేయమైన విడాకులు వీరివే అవుతాయని స్పష్టం చేసింది. విల్ స్మిత్- జాడా మధ్య మనస్పర్థలకు ఆస్కార్ ఘటన ఒక్కటే కారణం కాదట. వీరిద్దరి మధ్య కొన్ని సంవత్సరాలుగా అభిప్రాయ భేదాలు తలెత్తుతున్నాయని తెలిపింది.
ఆస్తిలో 50 శాతం వాటా.. విల్ స్మిత్-జాడా మధ్య విడాకుల ఒప్పందం కూడా కుదిరినట్లు హాలీవుడ్ మీడియా ప్రచురించింది. స్మిత్ ఆస్తి విలువ సుమారు 350 మిలియన్ డాలర్లు కాగా.. జాడా అందులో 50 శాతం వాటాను అడిగినట్లు సమాచారం. అకాడమీ వేడుకల తర్వాత ఓ టీవీ షోలో పాల్గొన్న ఈ జంట.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అసలు జాడాకు విల్‌తో పెళ్లి ఇష్టం లేదని, కానీ అప్పటికే ఆమె గర్భవతి కావడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చిందని టీవీ షోలో బహిర్గతంగా చెప్పారు. దీంతో ఈ వీడియో కూడా వైరల్ అయింది.
భారత్‌కు వచ్చిన విల్ స్మిత్.. విల్ స్మిత్ తాజాగా భారత్‌కు వచ్చారు. శనివారం ముంబయి విమానాశ్రయం వద్ద అతడి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. చెంపదెబ్బ ఘటన తర్వాత విల్.. కెమెరాలకు చిక్కడం ఇదే తొలిసారి. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ను కలిసేందుకే విల్ స్మిత్ వచ్చినట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. చెంపదెబ్బ ఘటనతో స్మిత్ కొద్ది రోజులుగా విచారంగా ఉన్నారట. దీంతో సద్గురు వద్ద కొంత సమయం గడిపేందుకు వచ్చారని సమాచారం. ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు వెలువడలేదు.
ఇవీ చదవండి: ఆస్కార్‌కు ఆగ్రహమూ ఎక్కువే.. 'విల్‌స్మిత్'లా గతంలోనూ..
విల్ స్మిత్‌పై చర్యలు.. పదేళ్ల పాటు ఆస్కార్ వేడుకలకు నో ఎంట్రీ