ETV Bharat / entertainment

హీరో భార్యతో ఎలాన్ మస్క్ రాసలీలలు.. విడాకుల కేసులో ట్విస్ట్! - జానీ డెప్ అంబర్ హార్డ్ కోర్టు వివాదం

Johny Depp case Elon Musk: హాలీవుడ్ స్టార్ జానీడెప్, అతడి మాజీ భార్య అంబర్​హెర్డ్ విడాకుల వ్యవహారంపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయంపై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది. వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు వచ్చిన జానీడెప్.. కీలక విషయాలు వెల్లడించారు.

JOHNY DEPP AMBER HEARD ELON MUSK
జానీ డెప్ అంబర్ హార్డ్ ఎలాన్ మస్క్
author img

By

Published : Apr 21, 2022, 10:19 PM IST

Johny Depp case Elon Musk: పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్ ఫేమ్, హాలీవుడ్ స్టార్ హీరో జానీడెప్ విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తన మాజీ భార్య, ప్రముఖ నటి అంబర్​హెర్డ్​పై రూ.380 కోట్ల పరువు నష్టం కేసు దాఖలు చేసిన జానీ డెప్.. దీనిపై వర్జీనియాలోని ఫెయిర్​ఫాక్స్​లోని కౌంటీ కోర్టులో జరిగిన విచారణకు హాజరయ్యారు. తన భార్య ఎప్పుడూ తనను మానసికంగా వేధించేదని కోర్టులో ఆరోపించారు. 'అంబర్​హెర్డ్ ఆరోపణలు చాలా దారుణమైనవి.. బాధకలిగించేలా ఉన్నాయి. నా జీవితంలో ఏ మహిళపైనా నేను చెయ్యి చేసుకోలేదు' అని జానీ డెప్ చెప్పుకొచ్చారు.

JOHNY DEPP AMBER HEARD ELON MUSK
పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్ మూవీలో జానీ డెప్

అయితే, అంబర్​ హెర్డ్​ను కుళ్లిపోయిన శవంగా జానీడెప్ అభివర్ణిస్తూ తన స్నేహితుడికి సందేశాలు పంపాడని నటి తరఫున హాజరైన న్యాయవాది వాదించారు. ఈ మేరకు ఆ స్నేహితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో పాటు ఆమెను దుర్భాషలాడుతూ వ్యాఖ్యలు చేశారని కోర్టులో ఆరోపించారు. మరోవైపు, అంబర్​హెర్డ్ తనపై చెయ్యి చేసుకున్నారని.. నటి ఇంట్లో పని చేసిన మహిళ ఆరోపించారు. జీతం పెంచాలని అడిగినందుకు చెంప ఛెళ్లుమనిపించారని అన్నారు. ఏ కారణాలు లేకుండానే అప్పుడప్పుడూ ఆరిచేవారని చెప్పుకొచ్చారు. కాగా, జానీ డెప్​పై అంబర్​హెర్డ్ ఇదివరకే రూ.760 కోట్ల పరువునష్టం వ్యాజ్యం దాఖలు చేశారు.

JOHNY DEPP AMBER HEARD ELON MUSK
ఆక్వామ్యాన్​లో అంబర్​హెర్డ్

Elon Musk threesome with Amber Heard: ఇదిలా ఉంటే.. ఈ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పేరు ఈ కేసులో మార్మోగుతోంది. కోర్టు డాక్యుమెంట్లలో మస్క్ పేరు ఉంది. జానీ డెప్ ఇంట్లో లేనప్పుడు అంబర్​హెర్డ్​తో కలిసి ఎలాన్ మస్క్ నడిపిన రాసలీలలకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. అంబర్​హెర్డ్​తో పాటు మరో నటి కారా డెలెవింగ్నెతో కలిసి మస్క్ రొమాన్స్ చేశారన్నది ఈ ఆరోపణల సారాంశం. 2016లో లాస్ఏంజిలిస్​లోని జానీడెప్, అంబర్​హెర్డ్​ల అపార్ట్​మెంట్​లోనే వీరు అఫైర్ నడిపారని తెలుస్తోంది. దీనిపై ఎలాన్ మస్క్ కోర్టులో వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఈ కేసు విచారణ నెల రోజుల పాటు జరిగే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

ఓటీటీలోకి మిషన్ ఇంపాజిబుల్... సర్కారు వారి 'పాట' అప్డేట్!

యశ్ నోట బాలయ్య డైలాగ్.. 'కేజీఎఫ్-2' సక్సెస్​పై ఎమోషనల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.