ప్రధాని నరేంద్రమోదీతో పాటు భాజపా మంత్రివర్గ సభ్యులూ విజయభేరి మోగించారు. కొంతమంది మాజీ అధికారులు, కేంద్రమంత్రులు మనోజ్ సిన్హా, హర్దీప్ పురి, కేజే ఆల్ఫోన్స్ మినహాయిస్తే మంత్రులందరూ గెలుపు బాట పట్టారు. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన అమేఠీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ 55 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వారణాసిలో మోదీ భారీ ఆధిక్యంతో గెలుపొందారు. కూటమి అభ్యర్థి, ఎస్పీ నేత షాలినీ యాదవ్‌పై 4.79 లక్షల మెజారిటీ సాధించారు మోదీ. గత ఎన్నికలతో పోలిస్తే లక్ష ఓట్లు అధికంగా సాధించారు. అనూహ్యంగా తెరపైకి వచ్చిన జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్‌పై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ 4.22 లక్షల మెజారిటీతో బెగూసరాయ్ స్థానం నుంచి గెలుపొందారు.
బిహార్ పట్నాసాహిబ్‌లో సిట్టింగ్ ఎంపీ శతృఘ్న సిన్హాపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ 2.84 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. పార్టీలోని కీలక నేతలు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీతో పాటు మరింత మంది గెలుపు తీరాలకు చేరారు.
అభ్యర్థి | సమీప ప్రత్యర్థి | స్థానం |
రాజ్‌నాథ్ సింగ్ | పూనమ్ సిన్హా (ఎస్పీ) | లఖ్‌నవూ |
నితిన్ గడ్కరీ | నానా పటోలే (కాంగ్రెస్) | నాగ్‌పుర్ |
రాధామోహన్ సింగ్ | ఆకాశ్ సింగ్ | పూర్వి చంపారన్ |
ఆర్కే సింగ్ | రాజు యాదవ్ (సీపీఐ) | ఆరా |
అశ్విని కుమార్ చౌబే | జగదానంద్ సింగ్(ఆర్జేడీ) | బక్సర్ |
రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్ | కృష్ణ పూనియా (కాంగ్రెస్) | జైపుర్ గ్రామీణం |
అనంత్ కుమార్ హెగ్దే | అనంద్ అస్నోతికర్ | ఉత్తర కన్నడ |
వీకే సింగ్ | సురేశ్ బన్సాల్ (ఎస్పీ) | ఘజియాబాద్ |
మహేశ్ శర్మ | సత్యపాల్ (బీఎస్పీ) | గౌతం బుద్ధ నగర్ (నోయిడా) |
మేనకా గాంధీ | చంద్ర భద్ర సింగ్(బీఎస్పీ) | సుల్తాన్‌పుర్ (ఉత్తరప్రదేశ్) |
సత్యపాల్ సింగ్ | జయంత్ చౌదరి (ఆర్ఎల్డీ) | బాగ్పథ్ (ఉత్తరప్రదేశ్) |
ఇదీ చూడండి: నమో ప్రభంజనం... ఎన్డీఏ ఘన విజయం