సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్లో ఈవీఎంల మొరాయింపు కొనసాగుతోంది. అసోం కరీంగంజ్ లోక్సభ పరిధిలో ఈవీఎంల మొరాయింపుపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడైర్గుల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం నుంచి పోలింగ్ మొదలుకాలేదు. జోనల్ అధికారి ముందు ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ఈవీఎంలు మార్చాలని కోరారు.
ఆందోళన వ్యక్తం చేస్తోన్న ఓటర్లపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటర్లు భయంతో పరుగులు తీశారు. ఈ విషయంపై ఈసీ ఇంకా స్పందించలేదు.
- ఇదీ చూడండి: జోరుగా సాగుతున్న రెండోదశ పోలింగ్