ETV Bharat / elections

భారత్​ భేరి: జాతీయ పార్టీల 'ఉనికి' పాట్లు - డీఎంకే

తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలదే ఆధిపత్యం. దశాబ్దాలుగా జాతీయపార్టీలు నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా ఫలితం శూన్యం. కూటమిలో భాగస్వాములుగానే మిగిలాయి. ఇప్పుడు ద్రవిడ దిగ్గజాలు జయ, కరుణ లేకుండా జరుగుతున్న పోరులోనైనా ఉనికి చాటుకోవాలని చూస్తున్నాయి భాజపా, కాంగ్రెస్.

తమిళనాడు
author img

By

Published : Apr 14, 2019, 6:33 AM IST

Updated : Apr 14, 2019, 7:08 AM IST

ఉనికి కోసం జాతీయ పార్టీల తిప్పలు

మోదీ ప్రభంజనం..! 2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వినిపించిన మాట. ఆ స్థాయిలో ఘన విజయం సాధించింది భాజపా. కానీ... 39 నియోజకవర్గాలున్న తమిళనాడులో ఆ పార్టీ గెలిచింది ఒకే ఒక్క సీటు. అది కూడా కూటమిలో భాగంగా ఉండి. తమిళనాడులో భాజపా బలం ఎంతో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ.
కాంగ్రెస్​దీ అదే తీరు. భాజపాతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్​ ప్రాబల్యం కాస్త ఎక్కువే అయినా... తమిళనాడులో మాత్రం గడ్డు పరిస్థితి.

2019 సార్వత్రిక సమరం వేదికగా తమిళనాడులో ఉనికి చాటుకోవాలని భావిస్తున్నాయి రెండు జాతీయ పార్టీలు. అందుకోసం ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చుకుని బరిలోకి దిగాయి. ద్రవిడ దిగ్గజాలు జయలలిత, కరుణానిధి మరణాంతరం తమిళనాట మారిన రాజకీయ సమీకరణాలు తమకు లాభిస్తాయన్నది భాజపా, కాంగ్రెస్​ ఆశ.

అస్తిత్వం కోసం సుదీర్ఘ పోరాటం

తమిళనాడులో 1998 పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా బోణీ కొట్టింది. అదీ అన్నాడీఎంకే, ఎండీఎంకే, పీఎంకే వంటి ప్రాంతీయ పార్టీల పొత్తుతోనే సాధ్యమైంది. డీఎంకే పొత్తుతో మరింత పుంజుకుని 1999లో నాలుగు సీట్లలో విజయం సాధించింది భాజపా. అయితే... మతవాదాన్ని భాజపా విడనాడలేదని చెబుతూ ఐదేళ్ల తర్వాత కమలదళంతో తెగదెంపులు చేసుకుంది డీఎంకే.

2004 ఎన్నికల్లో మరోసారి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంది భాజపా. కూటమిని ప్రజలు తిరస్కరించారు. ఒక్క సీటైనా గెలవలేకపోయారు. ఫలితాలపై అసంతృప్తి వ్యక్తంచేసిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత.. మరెప్పుడూ భాజపాతో పొత్తు పెట్టుకోనని శపథం చేశారు. మరణం వరకూ ఆ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నారు. డీఎంకే కూడా కమలదళానికి దూరంగానే ఉంటూ వచ్చింది. అలా 2009లో ఒంటరిగానే ప్రయాణం చేసింది భాజపా.

మోదీ ప్రభంజనంతో..

2014 ఎన్నికల్లో డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే పార్టీలతో భాజపాకు పొత్తు కుదిరింది. ఆ ఎన్నికల్లో 19 శాతం ఓట్లు సాధించగలిగిందీ కూటమి. అయినా పొత్తు విచ్ఛిన్నం అయ్యేందుకు ఎన్నో రోజులు పట్టలేదు. ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సేకు మోదీ ఆహ్వానం పంపటంపై తమిళ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కూటమి నుంచి వైదొలిగాయి.

ఐదేళ్ల ఎదురీత

ఐదేళ్ల మోదీ పాలనలో ఎన్నో అంశాల్లో భాజపాపై తమిళనాట వ్యతిరేకత కనిపించింది. ప్రధాని నరేంద్రమోదీ ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లినప్పుడు నల్లజెండాలతో నిరసనకారులు స్వాగతం పలకడం ఇందుకు ఒక నిదర్శనం.

  • కావేరి జల వివాదం- చెన్నైలో ఐపీఎల్​ మ్యాచ్​లు రద్దు
  • నీట్​ రద్దుకు డిమాండ్​
  • కావేరి డెల్టాలో పెట్రోలియం, హైడ్రోకార్బన్​ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపడంపై నిరసనలు
  • స్టెరిలైట్​ వివాదంలో ఫ్యాక్టరీ యాజమాన్యానికి భాజపా మద్దతుపై వ్యతిరేకత
  • హిందీని బలవంతంగా ప్రజలపై రుద్దుతున్నారని ఆగ్రహం
  • 2009లో తమిళుల ఊచకోత విషయంలో శ్రీలంక ప్రభుత్వంపై అంతర్జాతీయ విచారణ చేపట్టాలని అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానంపై కేంద్రం ఉదాసీన వైఖరి

2019లో మరోమారు అన్నాడీఎంకేతో జట్టుకట్టింది భాజపా. కూటమి కోటాలో 5 చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపింది. వీరిలో ఒక్కరు గెలిచినా ఆ పార్టీకి సంతోషమేనన్నది విశ్లేషకుల మాట.

హస్తానిదీ ఇదే పరిస్థితి

కాంగ్రెస్​ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. డీఎంకే, ఎండీఎంకే, వీసీకేతో జట్టుకట్టింది కాంగ్రెస్​. తొమ్మిది స్థానాల్లో పోటీలో ఉంది. ఐదు స్థానాల్లో కాంగ్రెస్​కు అన్నాడీఎంకే ప్రత్యర్థి. రెండు చోట్ల భాజపాతో, మరో రెండు నియోజకవర్గాల్లో నటుడు విజయకాంత్ పార్టీ డీఎండీకేతో పోటీ.

డీఎంకేతో బరిలోకి వామపక్షాలు

డీఎంకేతో పొత్తు కుదుర్చుకున్న రెండు వామపక్ష పార్టీలు చెరో రెండుస్థానాల్లో బరిలోకి దిగుతున్నాయి. గతేడాది తమిళనాడులో పోటీలోనే నిలవని కమ్యూనిస్టులు ఈసారైనా ఉనికి చాటాలని ప్రయత్నిస్తున్నారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Dubrovnik, Croatia - April 12, 2019 (CCTV - No access Chinese mainland)
1. Meeting venue
2. Chinese Premier Li Keqiang (R) shaking hands with Polish Prime Minister Mateusz Morawiecki (L), posing for photos
3. Cameramen
4. Li shaking hands with Lithuania's Prime Minister Saulius Skvernelis (L), posing for photos
5. Various of Li shaking hands with Estonian Prime Minister Juri Ratas (L), posing for photos
6. Li shaking hands with Hungarian Prime Minister Viktor Orban (L), posing for photos
7. Li shaking hands with North Macedonian Prime Minister Zoran Zaev (L), posing for photos
8. Li shaking hands with Montenegro's Prime Minister Dusko Markovic (L), posing for photos
9. Li shaking hands with Chairman of Bosnia and Herzegovina's Council of Ministers Denis Zvizdic (L), posing for photos
10. Li shaking hands with Romanian Prime Minister Viorica Dancila (L), posing for photos
11. Various of meetings between Li, eight CEEC government leaders in progress
12. Motorcade moving
13. Croatian Prime Minister Andrej Plenkovic at airport
14. Li shaking hands with Plenkovic
15. Li shaking hands with Croatian officials
16. Plenkovic waving to Li
17. Li, his wife Cheng Hong, waving to Croatian officials
Chinese Premier Li Keqiang met eight government leaders from Central and Eastern European countries on Friday in southern Croatian coastal city Dubrovnik.
Li met with Polish Prime Minister Mateusz Morawiecki, Lithuania's Prime Minister Saulius Skvernelis, Estonian Prime Minister Juri Ratas, Hungarian Prime Minister Viktor Orban, North Macedonian Prime Minister Zoran Zaev, Montenegro's Prime Minister Dusko Markovic, Chairman of Bosnia and Herzegovina (BiH)'s Council of Ministers Denis Zvizdic and Romanian Prime Minister Viorica Dancila on the sidelines of the eighth leaders' meeting between China and Central and Eastern European Countries (CEEC).
China and the eight CEE countries enjoy complementary advantages in economy and have huge potential for cooperation, said Premier Li.
He said more efforts should be made to explore new bilateral cooperation modes and ensure that cooperation projects between the two sides are sustainable.
China welcomes more marketable products to enter the Chinese market and is willing to align the Belt and Road Initiative with the development strategies of all the countries, said the Chinese premier.
The eight leaders all agreed that the 16+1 cooperation (China-CEEC cooperation) has greatly boosted the economic and social development of their countries and the connectivity projects have shown positive ripple effect, promoting the welfare of their peoples.
They said the eight countries stand ready to work with China to carry out more third-party market cooperation.
In the afternoon, Li left Croatia for China after attending the 21st China-EU leaders' meeting in Brussels, the eighth leaders' meeting of China and Central and Eastern European Countries in Croatia and paying an official visit to the country.
Prior to his departure, Croatian Prime Minister Andrej Plenkovic, along with Deputy Prime Minister and Foreign Minister Marija Pejcinovic Buric, as well as other high-level officials, saw Li off at the airport.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Apr 14, 2019, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.