11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 95 లోక్‌సభ నియోజక వర్గాల్లో సార్వత్రిక ఎన్నికల రెండోదశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఈవీఎంలు మొరాయించాయి. ఈసీ వెంటనే వాటిని మార్చి ఓటింగ్‌కు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంది. పోలింగ్ ఆరంభంలోనే పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ ప్రజలు స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
ఎక్కడ.. ఎంత శాతం?
ఉదయం 9 గంటల సమయానికి అసోంలో 9.51 శాతం, జమ్ముకశ్మీర్ 0.99%, కర్ణాటక 7.54%, మహారాష్ట్ర 0.85%, మణిపూర్ 14.99%, ఒడిశా 2.15%, తమిళనాడు 13.48%, యూపీ 10.76 శాతం
పోలింగ్ నమోదైంది. బంగాల్‌లో 0.55 శాతం ఓటర్లు, ఛత్తీస్‌గఢ్‌లో 13.4%, పుదుచ్చేరిలో 1.62% బిహార్‌లో 12.27 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఓటింగ్‌లో ప్రముఖులు...
రెండోవిడత పోలింగ్ ఆరంభంలోనే పలువురు ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి సేలం జిల్లా ఎడప్పాడిలో క్యూలైన్ లో నిల్చొని ఓటు వేశారు. కారయ్‌కుడిలో చిదంబరం ఓటేశారు. రజనీకాంత్ చెన్నైలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, కనిమొళి ఓటు వేశారు.
చెన్నైలోని ఆళ్వార్‌పేట ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో కమల్‌హాసన్, శృతిహాసన్ ఓటేశారు. పుదుచ్చేరిలో సీఎం నారాయణస్వామి, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, బెంగళూరు జయనగర్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, మహారాష్ట్రలోని సోలాపుర్‌లో కాంగ్రెస్ నేత సుశీల్‌కుమార్ శిందే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కర్ణాటక రామనగర్ పోలింగ్ కేంద్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి కుటుంబ సమేతంగా ఓటు వేశారు. మణిపుర్లో సీఎం బిరేన్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- ఇదీ చూడండి: ఎమ్మెల్యే హత్యలో ప్రమేయమున్న మావోల హ
తం