Suicide: చిత్తూరు జిల్లా కుప్పంలో గంగమ్మ ఆలయ మాజీ ఛైర్మన్, వైకాపా నేత పార్థసారథి ఆత్మహత్య కలకలం రేపింది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. గంగమ్మ ఆలయం పాలకవర్గం ఛైర్మన్ గా పార్థసారథి కొనసాగారు. ప్రస్తుతం ఆలయ పాలకవర్గం ఛైర్మన్ తోపాటు.. కొత్తవారిని సభ్యులుగా నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇదే సందర్భంలో.. పార్థసారథి ఆత్మహత్య చేసుకోవడం పట్ల స్థానికంగా భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: మహిళతో అసభ్య ప్రవర్తన.. స్థానికుల దాడిలో వ్యక్తి మృతి