ETV Bharat / crime

Arrested for twitter post: సీఎంను చంపుతానని పోస్ట్.. యువకుడు అరెస్ట్ - సీఎంను చంపుతానంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు

Arrested for twitter post: మానవబాంబుగా మారి ఏపీ ముఖ్యమంత్రిని చంపుతానని.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన యువకుడిని.. సీఐడీ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 16న ట్విట్టర్‌లో పెట్టిన పోస్టుపై తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించినట్టు.. సైబర్‌ క్రైం ఎస్పీ రాధిక తెలిపారు.

Arrested for social media post
సైబర్‌ క్రైం ఎస్పీ రాధిక
author img

By

Published : Jan 21, 2022, 11:00 PM IST

Arrested for twitter post: మానవబాంబుగా మారి ఏపీ సీఎంను చంపుతానని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన యువకుడిని.. సీఐడీ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను సైబర్‌ క్రైం ఎస్పీ రాధిక వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన రాజాపాలెం ఫణి.. హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి. ఈ నెల 16న ట్విట్టర్‌లో పెట్టిన పోస్టుపై తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించినట్టు తెలిపారు.

twitter post: అయితే, వెంటనే ఆ పోస్టు డిలీట్‌ చేయడంతో పాటు.. నిందితుడు ట్విట్టర్ ఖాతా మూసేశాడు. ఫోన్‌ కూడా స్విచాఫ్‌ చేశాడు. అయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఫణిని అరెస్టు చేశామని.. నిందితుడు జనసేన మద్దతుదారుడని ఎస్పీ రాధిక తెలిపారు. ఇలాంటి పోస్టులు పెట్టే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.