హైదరాబాద్ హుమయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి 11 గంటలకు మహమ్మద్ యూసుఫ్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న హుమయున్ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం యూసుఫ్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ.. యూసుఫ్ మృతి చెందాడు. పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న యూసుఫ్ తల్లి ఉస్మానియా ఆస్పత్రికి పరిగెత్తుకొచ్చింది. తన కొడుకును చంపిన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. తన కొడుకు హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి : Diagnostics: కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్తే నిలువు దోపిడీ