ETV Bharat / crime

Murder: యువకుడి దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా? - వివాహేతర సంబంధం కారణంగా రెండు ప్రాణాలు బలి

తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకొని తండ్రి ఆత్మహత్యకు కారణమయ్యాడని... ఓ వ్యక్తిని గొడ్డలితో నరికి చంపాడో తనయుడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

youngman murder in khammam
యువకుడి దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
author img

By

Published : May 30, 2021, 7:20 PM IST

ఖమ్మం జిల్లా బోనకల్ మండలం తూటికుంట్ల గ్రామంలో వివాహేతర సంబంధం ఓ యువకుడు దారుణ హత్యకు కారణమైంది. గ్రామానికి చెందిన కొడిమెల ఉపేందర్ రావు(25) అదే ఊరిలోని ఓ వివాహితతో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం ఆమె భర్తకు తెలిసి యువకుడిని హెచ్చరించాడు. అయినప్పటికీ మారక పోవడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టించాడు. కొద్ది రోజులు బాగానే ఉన్నా ఉపేందర్ రావ్ మళ్లీ వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో.. మనస్తాపం చెందిన ఆమె భర్త మాడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పటి నుంచి మహిళ కుమారుడు ఉపేందర్ రావుపై కోపం పెంచుకున్నాడు. తన తండ్రి చావుకు కారణమైన ఉపేందర్​ రావును.. తన తల్లితో సంబంధం తెంచుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు. అయినా అతడి తీరు మార్చుకోకపోవడంతో ఉపేందర్ రావు హత్యకు పథకం రచించాడు. ఉపేందర్ రావు డాబాపై నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో నరికి అతికిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తప్పించుకొని పారిపోయాడు. విషయం తెలుసుకున్న మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : Eatala: ఒక్క ఎకరం ఎక్కువ ఉన్నా ముక్కు నేలకు రాస్తా: ఈటల సతీమణి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.