హైదరాబాద్ గోల్కొండ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలతో అన్నను దారుణంగా హతమార్చాడో ఓ తమ్ముడు. షేక్‌పేటకు చెందిన విజయ్, నరేందర్ ఇద్దరు అన్నదమ్ములు. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. రాత్రి వీరిద్దరి మధ్య ఆస్తి మరింత వైరాన్ని పెంచింది. చివరకు నరేందర్ అన్న విజయ్ను కర్రలతో దాడి చేసి చంపాడు.
విజయ్ను హత్య చేసిన అనంతరం నిందితుడు నరేందర్ అక్కడి నుంచి పారిపోగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని వెంటనే పట్టుకుంటామని గోల్కొండ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర కలకలం రేపింది.
ఇదీ చదవండి: భర్తను చంపింది, జైలు పాలయ్యింది.. పిల్లలను ఒంటరి చేసింది..!