ETV Bharat / crime

Suicide: పెళ్లికి నిరాకరణ... యువతి ఆత్మహత్య - Telangana news

ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా విప్పలమడకలో చోటుచేసుకుంది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

suicide
suicide
author img

By

Published : Jun 8, 2021, 9:54 PM IST

ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడకలో ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో శారద అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎమ్మెస్సీ వరకు చదివిన యువతి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. వైరా మండలంలోనే గరికపాడుకు చెందిన ప్రవీణ్‌ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చరవాణీలో ఇరువురి సంభాషణలు, చిత్రాలు పోలీసులకు అందించారు. ఉన్నత విద్య చదివి తమకు అండగా ఉంటుందని ఆశించిన తల్లిదండ్రులు యోహాన్‌, లూర్దులు కుమార్తె మృతిచెందడంతో కన్నీటి పర్యంతమయ్యారు. శారద మృతదేహంపై పడి రోదిస్తున్న తీరు అందరిని కంట తడిపెట్టించింది. వైరా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.