రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు తీసుకుని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ఓ ముఠాను మహబూబ్‌నగర్ జిల్లా చింతకుంట మండల కేంద్రంలోని యువకులు అడ్డుకున్నారు. రవాణా చేసేందుకు సిద్దంగా ఉంచిన 70 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
జిల్లాలోని చిన్న చింతకుంట మండల పరిధిలోని అమ్మాపూర్, తిరుమలాపూర్ పరిసర ప్రాంతాల్లో లబ్ధిదారుల వద్ద నుంచి కొందరు పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రేషన్ బియ్యాన్ని లారీలో ఎక్కిస్తుండగా స్థానిక యువకుల ఆపివేశారు. రెండు బొలేరో వాహనాలు, ఓ లారీ సహా 70 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీస్ స్టేషన్‌కు పంపించారు. ఈ ఘటనలో అమరచింతకు చెందిన రాజశేఖర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు.
ఇదీ చదవండి: మేకపిల్లను కాపాడబోయి ఇంటర్ విద్యార్థి మృతి