స్నేహం చాటున మాయ ప్రేమకు మోసపోయి ఓ యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామానికి చెందిన మైలపాక సందీప్ అనే యువకుడు గీసుగొండ మండలం మచ్చపూర్ గ్రామానికి చెందిన స్రవంతి అనే యువతి మాయమాటలకు (Lady Cheater) మోసపోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
స్నేహితురాలుగా పరిచయమైన స్రవంతి... సందీప్‌ను మచ్చిక చేసుకుని తనకు ఇద్దరు స్నేహితురాళ్లు ఉన్నారని నమ్మబలికింది. సదురు స్నేహితులతో ఫోన్లో మాట్లాడాలని సందీప్‌ను కోరింది. అసలు మర్మం తెలియని సందీప్ ఆ ఇద్దరి అమ్మాయిలతో విడివిడిగా ఫోన్లో మాట్లాడాడు. ఈ క్రమంలో డబ్బులు ఇవ్వాలని స్రవంతి నమ్మబలికి ప్రియురాళ్ల అవసరాల నిమిత్తం సుమారు రూ. లక్ష వసూలు చేసింది.
డబ్బులు ఇచ్చేటప్పుడు ఎందుకు అని సందీప్ అడగగా... నీతో ప్రేమలో ఉన్న ఇద్దరిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని దానికి కారణం నువ్వే అని స్రవంతి చెప్పడంతో... భయాందోళనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బంధువులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇందులో అసలు విషయం ఏంటంటే... మాయ లేడి స్రవంతియే మరో ఇద్దరిలా మాట్లాడింది. ఈ విషయం తెలియని సందీప్... సూసైడ్ అటెంప్ట్ చేశాడు.
ఇదీ చూడండి: Child marriage: కాసేపట్లో పెళ్లి... అధికారుల ఎంట్రీతో ఆగిపోయింది..