ETV Bharat / crime

అయ్యో పాపం ఏమైందో.. కాసేపట్లో లండన్​ ఫ్లైట్​ ఎక్కాల్సిన వాడు ఉరేసుకున్నాడు..! - NTR District crime news

Young Man Suicide in NTR District: తమ కుమారుడు విదేశాలకు వెళ్లి బంగారు భవిష్యత్​కు బాటలు వేసుకుంటాడని భావించిన ఆ తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిలింది. వారి కలలను కన్నీళ్లుగా మార్చి ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరికొన్ని గంటల్లో విదేశాలకు వెళ్లాల్సిన యువకుడు ఓ చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణం చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.

Young Man Suicide in NTR District
Young Man Suicide in NTR District
author img

By

Published : Jan 12, 2023, 12:53 PM IST

Young Man Suicide in NTR District: మరికొన్ని గంటల్లో ఉన్నత చదువుల కోసం విమానం ఎక్కి లండన్‌ వెళ్లాల్సిన కుమారుడు అంతలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చాడు. ఆంధ్రప్రదేశ్​లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం హనుమంతుపాలెం గ్రామానికి చెందిన గాడిపర్తి వెంకటనారాయణ, రాణి దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు గోపీకృష్ణ లండన్‌లో ఎంఎస్‌ చదువుతున్నాడు. చిన్న కుమారుడు శివకృష్ణ(24) కూడా ఉన్నత చదువుల కోసం బుధవారం వేకువజామున 2.15 గంటలకు శంషాబాద్‌లో విమానం ఎక్కి లండన్‌ వెళ్లాలి.

అందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. తల్లిదండ్రులు కుమారుడిని ఎయిర్‌పోర్టుకు పంపించడానికి సిద్ధమయ్యారు. ఇక హైదరాబాద్‌కు కారులో బయలుదేరడమే ఉంది. ఈ పరిస్థితుల్లో మంగళవారం మధ్యాహ్నం 3.45 గంటలకు స్నేహితులను కలిసి వస్తానని చెప్పి శివకృష్ణ ఇంటి నుంచి వెళ్లి రాలేదు. సమయం అవుతోందని, ఇంటికి రావాలని ఆరు గంటల సమయంలో తండ్రి కుమారుడితో సెల్‌ఫోన్‌లో మాట్లాడారు. ఇంకా సమయం ఉందని, వస్తున్నానని చెప్పాడు.

అదే ఆఖరి మాట. తర్వాత సెల్‌ఫోన్‌ స్విచ్ఛాప్‌ వచ్చింది. కుమారుడి ఇంటికి రాకపోవడంతో వెతకడం ప్రారంభించారు. ఆచూకీ తెలియలేదు. బుధవారం ఉదయం పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట సమీపంలోని ఎన్‌ఎస్పీ కాల్వ కట్ట పక్కన చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తండ్రి, బంధువులు ఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు.

పెనుగంచిప్రోలు ఎస్సై హరిప్రసాద్‌.. మృతదేహాన్ని నందిగామ శవాగారానికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లండన్‌ వెళ్లేందుకు ఇష్టం లేకే బలవన్మరణానికి పాల్పడినట్లు భావిస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతదేహానికి ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నివాళులర్పించారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.