యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం పెద్ద తండాలో దారుణం జరిగింది. చెల్లెలి వరుసైన బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించాడని(rape attempt on girl) చిన్నారి కుటుంబసభ్యులు తెలిపారు. ధీరావత్ నవీన్ అనే యువకుడు తన ఇంటి పక్కనే ఉండే రెండేళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించినట్లు వాపోయారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని చెప్పారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని... ఆరా తీస్తున్నారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని... దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు నవీన్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఇద్దరు యాచకుల దారుణ హత్య