హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో యువకుడిని దారుణంగా హతమార్చిన ఘటన కలకలం సృష్టించింది. సురేశ్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు తలపై ఇనుప రాడ్‌తో మోదడంతో.. అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. పాతకక్షల కారణంగా ప్రత్యర్థులే ఈ హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీ కెమారాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: సాగునీటి రంగానికి పెద్దపీట.. రూపాయిలో 47 పైసలు కాళేశ్వరానికే!