ఏదైనా సరే సమపాళ్లలో తీసుకుంటేనే ఒంటికి, సమాజానికి మంచిది. అలా కాదని.. కొంచెం తక్కువైనా, మితిమీరి పోయినా విషంలా మారి దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. భద్రాచలంలో మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన ఓ యువకుడు.. దగ్గుమందుకు(Addicted to cough medicine) బానిసై వీరంగం సృష్టించాడు. మెడికల్ షాప్ యజమాని దగ్గు మందు టానిక్ ఇవ్వలేదని దుకాణంపై దాడికి దిగాడు. మత్తులో ఉన్న యువకుడిని స్థానికులు, పోలీసులు పట్టుకుని(Addicted to cough medicine) స్టేషన్‌కు తరలించారు.
క్రమంగా అలవాటు పడి
చాలా కాలం నుంచి డ్రగ్స్‌కు అలవాటు పడిన యువకుడు(Addicted to cough medicine) దగ్గు తగ్గడం కోసం మెడికల్ షాపులో విక్రయించే ఓ సిరప్ వాడటం మొదలుపెట్టాడు. మాదక ద్రవ్యాలు దొరక్కపోవడంతో మెల్లగా ఆ దగ్గు మందుకు బానిసయ్యాడు. ప్రతిరోజూ దుకాణానికి వెళ్లి.. సిరప్ కొనుక్కొని తాగి మత్తులో రోడ్లపై తిరుగుతూ ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో బ్రిడ్జి సెంటర్లోని ఒక మెడికల్ షాపు వద్దకు వెళ్లి దగ్గు మందు(Addicted to cough medicine) పేరు చెప్పి ఇవ్వమని అడిగాడు. దుకాణ యజమాని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తామని చెప్పాడు. దీంతో అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనంతరం వేరే దుకాణం నుంచి కాఫ్ సిరప్ తెచ్చుకొని తాగాడు. వెంటనే మొదటి షాపు వద్దకు వెళ్లాడు. ఆ దుకాణంలో ఇచ్చారు.. మీరెందుకు ఇవ్వరంటూ గొడవ చేశాడు. అనంతరం షాపుపై దాడికి దిగాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అతడికి సముదాయించినప్పటికీ ఆగకుండా ఆ కానిస్టేబుల్ ఎదుటే మెడికల్ దుకాణం(Addicted to cough medicine) పై రాళ్లు వేయడానికి ప్రయత్నించాడు. పోలీసు ఆపినా ఆగకుండా రోడ్డుపై హల్చల్ సృష్టించాడు. దీంతో బలవంతంగా ఆ యువకుడిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: TRS Dharna over Paddy procurement :' రైతును కష్టపెట్టిన ఏ సర్కార్ నిలబడలే'