ETV Bharat / crime

బావిలో పడి యువకుడు మృతి - telangana crime news

తోటి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది.

young man fell into well, nagar kurnool district crime news
బావిలో పడి యువకుడు మృతి
author img

By

Published : Apr 7, 2021, 8:44 AM IST

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూర్​లో యువకుడు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మంగళవారం మృతి చెందాడు. వేసవి కావడంతో తోటి స్నేహితులతో కలిసి వెంకటేష్(18)ఈతకు వెళ్లాడు. కానీ ఈత రాకపోవడంతో అతను బావి గడ్డపై కూర్చున్నాడు.

ప్రమాదవశాత్తు గడ్డపై ఉన్న ఆ యువకుడు బావిలో పడ్డాడు. నీళ్లు ఎక్కువగా ఉండడంతో అడుగుకు చేరుకున్నాడు. దీంతో అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతుడిని వెలికి తీశారు. ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్సై మురళి గౌడ్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి : రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెలు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.