నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని అజిలాపురం గ్రామంలో గల బుగ్గ జలపాతం ప్రవాహానికి ఓ యువకుడు కొట్టుకుపోయాడు. సూర్యాపేట జిల్లా టేకుమట్ల గ్రామానికి చెందిన తాళ్ల సాయి తేజ(20) తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నివాసముంటున్నాడు. ఆదివారం కావడంతో స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్స్‌లో ఎంజాయ్ చేయడానికి బుగ్గ జలపాతం వద్దకు వెళ్లాడు.
ఒక్కసారిగా ఎగువ నుంచి జలపాతం ఉధృతి పెరగటంతో ప్రమాదవశాత్తు వరదల్లో పడిపోయాడు. జలపాతం ఉధృతి పెరుగుతుండడంతో పెద్ద గుండు సమీపంలో ఇరుక్కుపోయి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థుల సహకారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: WALL COLLAPSE: కుప్పకూలిన ఇంటిగోడ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి