రంగారెడ్డి జిల్లా కర్మన్‌ఘాట్ దుర్గానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆనంద్ అనే యువకుడు మొయినాబాద్‌లోని ఓ మామిడితోటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆనంద్ దుర్గానగర్ కాలనీకి చెందిన డాక్కుమెంటరీ రైటర్ రాములు ఇంట్లో అద్దెకుండేవాడు. అతడికి చెందిన మామిడి తోటలోనే చనిపోయాడు. మృతుడి శరీరంపై గాయాలు ఉండటంతో ఆనంద్‌ను హత్య చేశారంటూ కుటుంబీకులు రాములు ఇంటిముందు బైఠాయించి ఆందోళనకు దిగారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి.. పడుకునేందుకు డాబా మీదకు వెళ్లారు.. తిరిగి వచ్చేసరికి ఇళ్లు గుళ్ల చేశారు