ETV Bharat / crime

jobless youth suicide: ఉద్యోగం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగి.. - nizamabad district news

young man commits suicide
ఉద్యోగం లేదని యువకుడు ఆత్మహత్య
author img

By

Published : Nov 18, 2021, 1:24 PM IST

Updated : Nov 18, 2021, 5:04 PM IST

13:21 November 18

ఉద్యోగం లేదని యువకుడు ఆత్మహత్య

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తారు.. తమ బతుకులు బాగు పడతాయనుకునే యువతకు ఆత్మహత్యలే శరణ్యంగా మిగిలాయి. ఓ వైపు వయసు మీరుతోంది.. మరోవైపు ఉద్యోగం రాలేదనే ఆవేదనతో ఎంతోమంది యువకులు మనస్తాపం చెందుతున్నారు. పెళ్లి వయసు మీరుతుండటంతో అటు కుటుంబీకులు, ఇటు స్నేహితుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సతమతమవుతున్నారు. ఉద్యోగం వస్తే కానీ పెళ్లి చేసుకోవద్దనే నిర్ణయంతో ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం లేదనే ఆవేదనతో 20 రోజుల వ్యవధిలోనే ముగ్గురు యువకులు బలవన్మరణం చెందారు. 

నిజామాబాద్​లో

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలోని తడగామలో విషాదం చోటుచేసుకుంది. ఉద్యోగం రావడం లేదనే ఆవేదనతో.. యువకుడు ఆత్మహత్య(suicide in telangana) చేసుకున్నాడు. తడగామకు చెందిన నేతికుంట చందు(30) ఈనెల 16న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు(youth suicide) యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున యువకుడు మరణించాడు. 

శోక సంద్రంలో కుటుంబీకులు

చందు మృతి(jobless youth suicide) చెందడంతో కుటుంబసభ్యులు నవీపేట్ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధం అవుతున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. ఉద్యోగం రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి వాపోయారు. చేతికందిన కుమారుడు మరణించడంతో కుటుంబీకులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

ఇటీవల పెరుగుతున్న ఆత్మహత్యలు

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎన్నో ఏళ్లుగా శిక్షణ తీసుకుంటూ.. ఎప్పటికీ నోటిఫికేషన్​ విడుదల కాకపోవడం వల్ల మనస్తాపంతో నల్గొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్ట(jobless youth suicide)లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ.. జాబ్​ నోటిఫికేషన్​ కోసం ఎదురు చూసి చూసి మనస్తాపంతోనే నవంబరు 6న బలవన్మరణం చెందుతున్నట్లు లేఖ రాసి ప్రాణాలు విడిచాడు.  

ఐదేళ్లుగా ఉద్యోగం కోసం

చిన్నప్పటి నుంచీ చదువులో ముందుండే నరేశ్​(30).. ఎప్పటికైనా సర్కారు కొలువు సాధిస్తాననే నమ్మకంతో... కుటుంబ సభ్యులను ఒప్పించి పీజీ వరకు చదివాడు. తండ్రి చనిపోయినా ఉద్యోగమే లక్ష్యంగా ఐదేళ్లుగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నప్పటికీ ఉద్యోగ నోటిఫికేషన్​(jobless youth suicide) విడుదలకాకపోవడంతో మనస్తాపం చెందాడు. కుటుంబ సభ్యులు పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి... తనకు ఉద్యోగం వస్తేగాని పెళ్లిచేసుకోనని చెప్పడంతో.. తన ఇద్దరి తమ్ముళ్లకు వివాహం జరిపించారు.  

డీఎస్సీ వేయలేదని

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం లేదని మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు ఒడిగట్టాడు. గత నెల 31న పత్తి చేనులో మహేశ్​... పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మహేశ్​ ప్రస్తుతం టీటీసీ పూర్తి చేసి.. అంబేడ్కర్ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ వేయడం లేదని మనస్తాపం చెంది పురుగుల మందు తాగాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు.  

ఇదీ చదవండి: ప్రభుత్వాస్పత్రిలో తల్లీబిడ్డ మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమా.?

Love Failure: ప్రేమ విఫలమైందని.. జీవితాన్ని మధ్యలోనే ముగించడమెందుకు..!!

Last Updated : Nov 18, 2021, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.