Attempt to Murder in Krishna Nagar : గుంటూరు కృష్ణానగర్‌లో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారంలో తల్లి, కుమార్తెపై యువకుడి దాడికి పాల్పడ్డాడు. తల్లి, కుమార్తె గొంతుపై బ్లేడ్‌తో దాడిచేయడంతో... ఇద్దరికీ స్వల్పగాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కృష్ణనగర్ పీఎఫ్ కార్యాలయం వద్దనున్న అపార్టుమెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడి అనంతరం అపార్టుమెంట్ రెండో అంతస్థు నుంచి దూకేందుకు యువకుడు యత్నించగా... పట్టుకున్న స్థానికులు... పోలీసులకు అప్పగించారు. గాయాలపాలైన యువకుడిని జీజీహెచ్‌కు తరలించారు.
ప్రేమ వ్యవహారంలో.. తల్లీకుమార్తెపై యువకుడి దాడి! - గుంటూరు జిల్లా నేర వార్తలు
Attempt to Murder in Krishna Nagar : అమ్మాయిలు తమను ప్రేమించడం లేదని కొందరు యువకులు వారు చావడమో లేక వారు ప్రేమించిన వాళ్లని చంపడమో చేస్తున్నారు నేటి యువకులు. క్షణికావేశంలో దాడులకు పాల్పడుతూ యువతుల ప్రాణాలు తీయడమే గాక.. వారి జీవితాలనూ నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ వ్యవహారంలో ఓ అమ్మాయిపై దాడికి యత్నించిన ఓ యువకుడు ఆమె తల్లి గొంతుపై బ్లేడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.