ETV Bharat / crime

Cell tower:సెల్ టవర్ ఎక్కిన యువ రైతు.. ఏం జరిగిందంటే.! - young farmer climbed the cell tower in thiryani mandal

రెవెన్యూ అధికారుల తీరుతో విసుగు చెందిన యువరైతు సెల్​టవర్​ ఎక్కాడు. తన భూమి పాసు పుస్తకం ఇచ్చే వరకు దిగేది లేదని భీష్మించుకు కూర్చున్నాడు. కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా తిర్యాని మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

farmer climbed the cell tower
టవర్​ ఎక్కి రైతు హల్​చల్​
author img

By

Published : Jul 9, 2021, 4:10 PM IST

భూమి పట్టా పాసు పుస్తకం ఇవ్వడం లేదని.. యువరైతు సెల్​టవర్​ ఎక్కిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే రాజమల్లు.. పాసు పుస్తకం కోసం గత కొన్ని రోజులుగా తహసీల్దార్​ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగు చెంది టవర్​ ఎక్కినట్లు తెలిపాడు.

విషయం తెలుసుకున్న తహసీల్దార్​, పోలీస్​ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాసు పుస్తకం వచ్చిందని చెప్పడంతో టవర్​ దిగడానికి ఒప్పుకున్నాడు. కిందికి దిగిన అనంతరం అతనికి పాసు పుస్తకం అప్పగించారు. రైతు టవర్​ ఎక్కడంతో దాదాపు గంట సమయం పాటు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సెల్ టవర్ ఎక్కిన యువ రైతు

ఇదీ చదవండి: DRUNKER HALCHAL: విద్యుత్ స్తంభం ఎక్కి తాగుబోతు హల్​చల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.