YOUNG COUPLE SUICIDE: వాళ్లిద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ. కలిసి జీవింతాంతం బతుకుదాం అనుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలను ఎదిరించి ఐదు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. ఇంతలో ఏ కష్టమొచ్చిందో తెలియదు.. నిండు నూరేళ్ల జీవితాన్ని నవదంపతులు అర్ధాంతరంగా ముగించారు. ఎన్నో ఆశలతో వివాహ జీవితాన్ని ప్రారంభించిన వారిద్దరూ... ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
రామంతాపూర్కు చెందిన సాయిగౌడ్, నవనీతా రెడ్డి ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో ఐదు నెలల క్రితం పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. రామంతాపూర్ శ్రీనగర్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఇద్దరు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి ఏ కష్టమొచ్చిందో ఏమో కానీ ఇంట్లో వారు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. అయితే మనస్పర్థల కారణంగానే చనిపోయి ఉంటారని స్థానికులంటున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. దంపతుల ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య.. కారణం అదేనా.!
భార్యను కాటేసిన పాము.. డాక్టర్లకు క్లారిటీ కోసం భర్త ఏం చేశాడంటే?