కుటుంబ సమస్యలతో యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఉరి వేసుకుని తనువులు చాలించారు. ఈ హృదయ విదారక ఘటన మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని కుమ్మర్వాడిలో జరిగింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాహుల్ (22), కరీనా(20) రెండు నెలల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి వలస వచ్చిన ఈ యువ జంట పానీపూరి వ్యాపారం నిర్వహిస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. వ్యాపారం సరిగా జరగడం లేదని బాధపడేవారని పోలీసులు తెలిపారు. గతనెల కరీనాకు గర్భస్రావం కావడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం వారు నివసించే అద్దెగదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.