యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపురం గ్రామానికి చెందిన గుగులోతు వీరన్న, గుగులోతు బుజ్జి తమ సొంత వాహనంలో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు యత్నించారు.
ఈ క్రమంలో ధర్మారం గ్రామ శివారులో తనిఖీలు చేస్తున్న పోలీసులు ఈ వాహనాన్ని ఆపారు. ట్రాలీలో తనిఖీ చేయగా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అడ్డగూడూర్ ఎస్సై కేసు నమోదు చేశారు.